Rashmi Gautam : జబర్ధస్త్ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల యాంకర్ రష్మీ గౌతమ్. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఎక్స్‌ట్రా జబర్ధస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, పలు ఈవెంట్స్ కి హోస్ట్ గా చేస్తుంది.యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడు నటిగా కూడా రాణిస్తూ ఉంది అందాల ముద్దుగుమ్మ రష్మి. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో మత్తెక్కిస్తూ ఉంటుంది. కేక పెట్టించే అందాలకి కుర్రాళ్ల మత్తెక్కి చిత్తైపోతుంటారు. ఇక రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వారు వ్యవహరించడంతో వీరి ప్రేమ వ్యవహారం ఎప్పటికీ చర్చనీయాంశంగానే ఉంటుంది. ఇక బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో భాగంగా సుధీర్ , రష్మీ కి చాలా సార్లు పెళ్లి చేశారు.
Rashmi Gautam సుధీర్‌కి హ్యాండ్ ఇచ్చి అమెరికా అబ్బాయితో పెళ్లి
ప్రోమోలో నిజంగానే పెళ్లి జరిగినట్టు బిల్డప్ ఇచ్చి ఫుల్ ఎపిసోడ్‌కి వచ్చే సరికి అదంతా స్రిప్ట్ లో భాగమే అని తేల్చేస్తారు.. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరించారు. ఈ రూమర్స్ ఇద్దరికీ బాగా కలసి వచ్చాయి. వీరి పాపులారిటీ పెరగడంలో ఈ రూమర్స్ పాత్ర ఎంతైనా ఉంది. అయితే ఇటీవల రష్మి పెళ్లికి సంబంధించి నెట్టింట చాలా రూమర్స్ హల్‌చల్ చేశాయి. ఒకటి రెండు సార్లు వీరికి ఉత్తుత్తి పెళ్లి కూడా చేశారు. అయితే తాము నిజమైన ప్రేమికులం కాదు, కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రేమికులుగా కనిపించామని రష్మీ, సుధీర్ చెబుతున్నా కూడా ఎవరు వినే పరిస్థితి లేదు. రష్మీ-సుధీర్ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని చెప్పే వాళ్లే ఎక్కువగా ఉన్నారు.
ఇదిలా ఉంటే రష్మీ గౌతమ్ Rashmi Gautam అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకోనుందని, జాతకాలు చూపించానని కమెడియన్ బుల్లెట్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ తాజా ఎపిసోడ్లో బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ..యాంకర్ రష్మీ వద్దకు వెళ్లి, మన బాబు(సుడిగాలి సుధీర్) బాగానే జీతాలు ఇస్తున్నట్లు ఉన్నాడు. నా వీడియోలు క్రింద కామెంట్స్ పెడుతున్నారు. ఒకడైతే ‘ఏరా నీ డిక్కీ బలిసిందా?’ అని కామెంట్ పెట్టాడు, అని రష్మీతో అన్నాడు. ఆ సమయంలో బుల్లెట్ భాస్కర్ పక్కన ఉన్న ఓ కమెడీయన్ నాకు ఒక విషయంలో క్లారిటీ రావాలి, రష్మీ-సుధీర్ పెళ్లి చేసుకుంటారా? అని అడిగారు. దానికి ఖచ్చితంగా చేసుకుంటారని చెప్పిన భాస్కర్.. రష్మీ అమెరికా అబ్బాయిని చేసుకుంటుంది. సుధీర్ అనకాపల్లి అమ్మాయిని చేసుకుంటాడు… అని అనడంతో అందరు గట్టిగా నవ్వేశారు.