Ram Charan : అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో అంబానీ పెళ్లికి రామ్ చరణ్, ఉపాసన.. వీడియో వైరల్

Ram Charan : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్ ఏది అంటే అంబానీ కొడుకు అనంత్, రాధిక మర్చెంట్ పెళ్లి. అవును.. చాలా రోజుల నుంచి వీళ్ల పెళ్లి హడావుడి నడుస్తోంది. ఎంగేజ్ మెంట్, సంగీత్, ఇలా పలు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరుగుతూ వచ్చాయి. తాజాగా వాళ్ల వివాహం కూడా జరగబోతోంది. ముంబైలో అత్యంత వైభవంగా వీళ్ల పెళ్లి జరుగుతోంది.

Advertisement

ram charan drives new rolls Royce spectre car to airport

Advertisement

అనంత్ పెళ్లికి నేషనల్ సెలబ్రిటీలే కాదు.. అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా వస్తున్నారు. పాప్ సింగర్స్, ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా అనంత్ పెళ్లి వేడుకలో హంగామా సృష్టిస్తున్నారు. అయితే.. అనంత్ పెళ్లికి హైదరాబాద్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కూడా వెళ్లారు. అందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు కానీ.. వాళ్లు వెళ్లింది మామూలు కారులో కాదు.. రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో.

Ram Charan : దేశంలో ఉన్న రెండో కారు అది

రోల్స్ రాయిస్ అంటేనే లగ్జరీకి మారు పేరు. చాలా కాస్ట్ లీ కారు అది. రోల్స్ రాయిస్ లో స్పెక్ట్రా మోడల్ కారు అది. ధర 7 కోట్లకు పైనే ఉంటుంది. మన దేశంలో అలాంటి కార్లు రెండే ఉన్నాయి. ఆ రెండో కారు రామ్ చరణ్ దగ్గర ఉంది. ఆ కారులో డ్రైవ్ చేసుకుంటూ తన ఇంటి నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు రామ్ చరణ్ వచ్చారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Author