Rahul Gandhi : రెండు చోట్ల దూసుకుపోతున్న‌ రాహుల్ గాంధీ..!

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి తాను పోటీ చేసిన రెండు స్థానాలు రాయ్ బరేలీ, వయనాడ్ లోనూ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ రెండు స్థానాల్లోనూ ఆధిక్యం కొనసాగిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీ, కమ్యూనిస్టు అభ్యర్థులు ఆయనతో పోలిస్తే చాలా దూరంగా ఉన్నారు.

దీంతో రాహుల్ గాంధీ ఈ రెండు సీట్లలోనూ భారీ ఆధిక్యంలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో బీజేపీ ప్రత్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ కంటే రాహుల్ 50 వేల ఓట్ల ఆధిక్యంలో ముందున్నారు. వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి, కేరళలో ఆ పార్టీ అధ్యక్షుడు కే సురేంద్రన్‌తో రాహుల్ గాంధీ పోటీ పడుతున్నారు.

రాహుల్ పై సీపీఐ సీనియర్ నేత అన్నీ రాజాను రంగంలోకి దింపింది. వయనాడ్‌లో రాహుల్ గాంధీ లక్ష ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ 5 వేల ఓట్లను మాత్రమే సాధించారు.

Author