Kalki 2898 AD Movie Review : ప్రభాస్ కల్కి రివ్యూ రెబల్ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసేలా.. రికార్డుల అంతు చూసేలా..!

Kalki 2898 AD Movie Review : ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కల్కి. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుండగా సినిమాను ఇప్పటికే చిత్ర యూనిట్ కు సంబందించిన కొంతమంది సెలబ్రిటీస్ కు స్పెషల్ ప్రీమియర్స్ వేసినట్టు తెలుస్తుంది. యూఎస్ లో ఈరోజు అర్ధరాత్రి షోలు పడుతుండగా అక్కడ ప్రీ సేల్స్ తోనే రికార్డ్ వసూళ్లను రాబడుతుంది కల్కి.ఇక కల్కి సినిమాపై ఉన్న అంచనాలు అందరికీ తెలిసిందే. నెల క్రితం రిలీజైన ట్రైలర్ నుంచి వార్మ్ క్రితం రిలీజైన మరో ట్రైలర్ వరకు సినిమాపై నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు రిలీజ్ ఒక్కరోజు ముందు వదిలిన థీం సాంగ్ అయితే నాగ్ అశ్విన్ ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నాడని అర్ధమయ్యింది.

Kalki 2898 AD Movie Review : ప్రభాస్ కల్కి రివ్యూ రెబల్ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసేలా.. రికార్డుల అంతు చూసేలా..!
Kalki 2898 AD Movie Review : ప్రభాస్ కల్కి రివ్యూ రెబల్ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసేలా.. రికార్డుల అంతు చూసేలా..!

కల్కి కథ చాలా కొత్తగా ఉంటుందని. సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వద్ధామ పాత్రలో ప్రభాస్ అదరగొట్టేశారని అంటున్నారు. కమల్ పాత్ర ఉన్న కొద్దిసేపు థియేటర్ లో విజిల్స్ వేస్తారని. సినిమా గ్రాండియర్ చూస్తే మనం తెలుగు సినిమా చూస్తున్నామా లేక ఏదైనా హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అన్న భావన కలుగుతుందట. దీపికా పదుకునే కూడా తన నటనతో మెస్మరైజ్ చేసిందని తెలుస్తుంది.

కల్కి సినిమాలో ప్రధానంగా హైలెట్స్ గురించి చెప్పుకుంటే సినిమా ఓపెనింగ్ తోనే కళ్లు మిరిమిట్లు గొలిపేలా చేశాడు నాగ్ అశ్విన్. ఇక సినిమా ఇంటర్వల్ బ్యాగ్ మరో హైలెట్ కాగా.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ రెండు సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్తాయి. సినిమాలో బిట్ సాంగ్ సినిమాను ఆడియన్ కు ఎమోషనల్ గా టచ్ చేసేలా ఉన్నాయి.

నాగ్ అశ్విన్ పేరు కచ్చితంగా కల్కి రిలీజ్ తర్వాత మారుమోగుతుంది. ప్రభాస్ మరోసారి తన స్టోరీ సెలక్షన్, తెలుగు సినిమా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ టెక్నికల్ టీం ప్రేక్షకులకు ఒక మర్చిపోలేని గొప్ప అనుభూతిని అందించారు. సినిమా రికార్డులు రివార్డుల గురించి రెబల్ ఫ్యాన్స్ లెక్కలేసుకోవాలని చెప్పొచ్చు.

Author