Kalki 2898 AD : కల్కి సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ఎలా తీశారో తెలుసా? ఇదిగో మేకింగ్ వీడియో

Kalki 2898 AD : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు కల్కి. ఈ మూవీ ఒక తెలుగు సినిమా కానీ.. ఇది దేశమే కాదు.. ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఈ మూవీ వందల కోట్లు కొల్లగొడుతోంది. విడుదలై ఒక్క వారం మాత్రమే అయింది కానీ.. వందల కోట్ల వసూళ్లు ఇప్పటికే రాబట్టింది. సినిమా తీయడానికి ఎంత ఖర్చు అయిందో దానికి మించిన వసూళ్లు సాధించి బాక్సాఫీసును బద్దలు కొట్టేసింది.

prabhas kalki 2898 ad movie action sequence making video

సినిమా విడుదలై వారం దాటినా ఇప్పటికీ ఏ థియేటర్, మల్టిప్లెక్స్ వద్ద చూసినా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ సత్తా ఏంటో నిరూపితం అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో హైలెట్ అంటే యాక్షన్ సీక్వెన్స్ అనే చెప్పుకోవాలి.

ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కు జనాలు ఫిదా అవుతున్నారు. హాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా తీసిన ఈ యాక్షన్ సీక్వెన్స్ ను చూసి మూవీ లవర్స్ మెస్మరైజ్ అవుతున్నారు. నోరెళ్లబెట్టేస్తున్నారు. మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ అన్నింటికీ కొరియోగ్రఫీ చేసింది ఎవరో కాదు.. కింగ్ సాలమన్ మాస్టర్. ఆయనే తన మాటలతో.. యాక్షన్ సీక్వెన్స్ ఎలా తీశారో చెప్పుకొచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ లను ఎలా డిజైన్ చేశారో కూడా ఆయన చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. కల్కి యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

Author