Post Office Jobs : 10th అర్హతతో పోస్ట్ ఆఫీస్… అలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం…!

Post Office Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. ఇటీవల ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి ఇండియన్ పోస్ట్ డిపార్ట్ మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి…

Post Office Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ….

మనకు ఈ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి ఇండియన్ పోస్ట్ డిపార్ట్ మెంట్ నుండి విడుదల కావడం జరిగింది…

Post Office Jobs ఖాళీలు…

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ పోస్ట్ డిపార్ట్ మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి 19 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కావున అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Post Office Jobs విద్యార్హత….

ఇండియన్ పోస్ట్ డిపార్ట్ మెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.

Post Office Jobs వయస్సు…

ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారి యొక్క వయసు 31 మే 2024 నాటికి గరిష్టంగా 56 సంవత్సరాలు మించి ఉండకూడదు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయసు సడలింపు వర్తిస్తుంది.

Post Office Jobs జీతం…

ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ లో విడుదల చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం…ఎంపికైన అభ్యర్థుల యొక్క జీతం వివరాలను ఇంకా నిర్ణయించలేదు. వీరి యొక్క జీతం అనేది అనుభవం మరియు పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

Post Office Jobs : 10th అర్హతతో పోస్ట్ ఆఫీస్... అలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం...!
Post Office Jobs : 10th అర్హతతో పోస్ట్ ఆఫీస్… అలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం…!

Post Office Jobs ఉద్యోగం చేయాల్సిన స్థలం…

ఇండియన్ పోస్ట్ డిపార్ట్మెంట్ నుండి విడుదల అయిన ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి బీహార్ లోని పాట్నా లో పోస్టింగ్ ఇస్తారు. అక్కడే ఉద్యోగం చేసుకోవాలి.

ఎంపిక విధానం…

డ్రైవింగ్ టెస్ట్, నైపుణ్య పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలంటే…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. దీనికోసం మీరు అఫీషియల్ వెబ్ సైట్ లో ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకుని మీ పూర్తి వివరాలను నమోదు చేసి అవసరమైన పత్రాలతో పాటు కింది చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

చిరునామా : చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం, బీహార్ సర్కిల్ , పాట్నా – 800001

ముఖ్యమైన తేదీలు….

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభతేదీ…16/ 4 /2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ… మే /31 /2024.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది