Raj Tarun : టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై ఓ యువతి కేసు పెట్టింది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది.
రాజ్ తరుణ్, తను 2012 నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. రాజ్ తరుణ్ పై ఆ యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడానికి కారణం.. ఓ సినీ నటితో రాజ్ తరుణ్ ఇటీవల కాలంలో సన్నిహితంగా ఉంటున్నాడని.. అది తట్టుకోలేక తనను మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసింది.
మేము చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. కానీ.. ఈ మధ్య నన్ను వదిలేసి వేరే అమ్మయితో రాజ్ తరుణ్ సన్నిహితంగా ఉంటున్నాడు. ఆ అమ్మాయి రిలేటివ్స్ కూడా నన్ను బెదిరిస్తున్నారు. అందుకే రాజ్ తరుణ్ మీద కేసు పెడుతున్నా.. అని నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్య ఫిర్యాదు చేసింది. అయితే.. లావణ్యపై గతంలో కొన్ని డ్రగ్స్ కేసులు ఉన్నట్టు నార్సింగి సీఐ హరికృష్ణ రెడ్డి తెలిపారు.
Raj Tarun : లావణ్య టార్చర్ తట్టుకోలేకే దూరంగా ఉంటున్నా
అయితే.. లావణ్య కేసుపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించాడు. లావణ్య టార్చర్ తట్టుకోలేకే తాను లావణ్యకు దూరంగా ఉంటున్నానని మీడియాకు తెలిపాడు. తను కూడా వేరే అబ్బాయితో రిలేషన్ షిప్ లో ఉందని.. నా పరువు పోతుందనే ఇన్నేళ్లుగా సైలెంట్ గా ఉన్నానన్నారు. లావణ్య టార్చర్ తట్టుకోలేక, తను మోసం చేసింది కాబట్టే మస్తాన్ బాయి కూడా కేసు పెట్టాడు. తన సొంత తండ్రిని కూడా లావణ్య మోసం చేసిందని రాజ్ తరుణ్ స్పష్టం చేశాడు.
Raj Tarun : లావణ్య ఫిర్యాదు లేఖలో ఏముందంటే?
రాజ్ తరుణ్, నేను 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం. ఇప్పుడు సినీ నటి మాల్వీ ట్రాప్ లో పడి, రాజ్ తరుణ్ నన్ను దూరం పెడుతున్నాడు. మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ నన్ను బెదిరిస్తున్నారు. రాజ్ తరుణ్ జీవితంలోంచి వెళ్లిపోకపోతే చంపుతామంటూ వాళ్లిద్దరూ బెదిరించారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం తమ నాన్నకు ఫ్రెండ్ అని, తాము తలుచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మాయాంక్ బెదిరించారు. ఒక కేసులో నేను ఇరుక్కున్నప్పటి నుంచీ రాజ్ తరుణ్ లో మార్పు వచ్చింది. మాల్వీతో ఎఫైర్ కారణంగా రాజ్ తరుణ్ నన్ను దూరం పెడుతున్నాడు. మాల్వీని కలుసుకోవడానికి తరుచూ రాజ్ తరుణ్ ముంబై వెళ్లేవాడు. రాజ్ తరుణ్ లైఫ్ నుంచి బయటకు వెళ్లాలంటూ మాల్వీ, మయాంక్ నాకు డబ్బు ఆశ చూపించారు. నేను ఎంతకూ వినకపోయేటప్పటికీ చంపేస్తామని బెదిరించారు. రాజ్ తరుణ్ లేకపోతే నేను ఉండలేను. మల్హోత్రా కుటుంబం నుంచి నాకు రక్షణ కల్పించండి.. అంటూ లావణ్య ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.