Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేను పారిపోలేదంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు..!

Phone Tapping Case : సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు లో ప్రధాన నిందితుడి ఎస్.ఐ.బీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాసిన లెటర్ ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆయన్ను విచారణకు రావాల్సిందంటూ పోలీసులు చెబుతుండగా జూన్ 23న ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఒక లెటర్ పంపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన లెటర్ లో రాసుకొచ్చారు. తాను అమెరికాలో ఉన్నానని.. ఆరోగ్యం బాగాలేక ఇక్కడ ఉండాల్సి వచ్చిందని చెప్పారు.జూన్ 26న ఇండియాకు రావాల్సి ఉన్నా తాను అనారోగ్య సమస్యల వల్ల రాలేకపోయానని ఆయన లెటర్ లో పేర్కొన్నారు. క్యాన్సర్, గుండె సంబందిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నట్టు చెప్పారు. అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్టు ప్రభాకర్ రావు లెటర్ లో రాసుకొచ్చారు. గతంలో మలిగ్నెంట్ క్యానర్ తో పాటుగా బీపీ ఉందని.. దాని వల్ల ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని అన్నారు.

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేను పారిపోలేదంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు..!
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేను పారిపోలేదంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు..!

Phone Tapping Case అసత్య ఆరోపణలు చేస్తున్నారంటున్న ప్రభాకర్ రావు..

తనపై కావాలని అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారని.. వాటి వల్ల కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతుందని అన్నారు. పోలీస్ అధికారిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని. చట్టపరంగా విచారణకు తాను సిద్ధమని అన్నారు. ఐతే దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు టెలీ కాన్ ఫరెన్స్, మెయిల్ ద్వారా తాను రెడీగా ఉన్నానని అన్నారు.

తాను ఒక క్రమ శిక్షణ కలిగిన అధికారిని అని.. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమే అని ప్రభాకర్ రావు అన్నారు. ఎక్కడికో తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదని.. పూర్తిగా కోలుకున్నాక మీ ముందుకు వస్తానని.. మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని అన్నారు. తన దాకా వచ్చిన ప్రతి సమాచారాన్ని చెప్పి విచారణకు సహకరిస్తానని ప్రభాకర్ రావు లెటర్ లో రాసుకొచ్చారు. తెలంగాణాలో ప్రముఖ ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో సినీ సెలబ్రిటీస్ ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందని కొన్నాళ్లుగా న్యూస్ వైరల్ అయ్యింది. ఐతే ఈ కేసు ని చాలా సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం దానిపై చాలా పకడ్బందీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

Author