Pawan Kalyan : ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. చాలా అరుదైన ఎర్ర చందనం దుంగలను విదేశాలకు తరలించడంపై ఆయన స్పందించారు. ఈ ఎర్రచందనం దుంగలను విదేశాలకు అక్రమంగా తరలించే వ్యవహారంపై ఆయన సీరియస్ అయ్యారు.
తాజాగా కడప జిల్లాలో ఎర్రచందనం డంప్ దొరికిన విషయం తెలిసిందే. అందులో 158 దుంగలు ఉన్నాయి. అంటే.. వాటి విలువ కనీసం 1.6 కోట్లు ఉంటుంది. వాటి గురించి డిప్యూటీ సీఎం దృష్టికి పోలీసులు తీసుకురాగా.. ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ పై సీరియస్ అయ్యారు.
Pawan Kalyan : ఎర్రచందనం దుంగలను ఎక్కడ దాచారో గుర్తించండి
మామూలుగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది. అక్కడ నరికిన ఎర్రచందనం దుంగలను ఎక్కడ దాచారో వెంటనే గుర్తించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఈ నెట్ వర్క్ ను నడిపిస్తున్న అసలు సూత్రధారులు ఎవరు? ఆ పెద్ద తలకాయలు ఎవరో పట్టుకోవాలని.. ఎర్రచందనం కూలీలు, రవాణా చేస్తున్న వాళ్లు, వెనుక ఉండి నడిపిస్తున్న వాళ్లందరినీ పట్టుకోవాలన్నారు.
ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు అయ్యాయి.. ఆ కేసుల్లో ఎంతమందిని అరెస్ట్ చేశారు.. వాళ్లలో ఎంతమందికి శిక్షలు పడ్డాయో.. ఆ వివరాలన్నీ తనకు అందించాలన్నారు. అలాగే.. శేషాచలం అడవుల నుంచి నరికి తీసుకెళ్లిన ఎర్రచందనం దుంగలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ పట్టుబడ్డాయో.. ఆ కేసుల్లో అక్కడే ఉన్న దుంగలను కూడా తిరిగి రాష్ట్రానికి తీసుకురావడంపై అధికారులు, పోలీసులు దృష్టి సారించాలని ఆదేశించారు.