Pat Cummins : ప్యాట్ క‌మిన్స్ చేసిన ప‌నికి అంద‌రు ఫిదా.. గొప్పోడివి అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్..!

Pat Cummins : ఆస్ట్రేలియా బౌల‌ర్ ప్యాట్ క‌మ్మిన్స్ ప్ర‌స్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. అత‌ని సారథ్యంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు దూసుకుపోతుంది. రీసెంట్‌గా హైదరాబాద్ వేదికగా జరగాల్సిన గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ రావడంతో.. SRH ప్లే ఆఫ్స్ కు వెళ్లింది. దాంతో ఈసారి కప్ కచ్చితంగా సన్ రైజర్స్ ఎగరేసుకుపోతుందని ఫ్యాన్స్ బల్ల గుద్దిమరీ చెబుతున్నారు. అయితే ఫ్యాన్స్ అంత గట్టిగా చెప్పడానికి కారణం కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కావడం విశేషం. సారథిగా ఎంతో అనుభం ఉన్న కమ్మిన్స్ కు కావ్య మార‌న్ పగ్గాలు అందించింది. అయితే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సన్ రైజర్స్ ను ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లాడు .

Pat Cummins : ప్యాట్ క‌మిన్స్ చేసిన ప‌నికి అంద‌రు ఫిదా.. గొప్పోడివి అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్..!
Pat Cummins : ప్యాట్ క‌మిన్స్ చేసిన ప‌నికి అంద‌రు ఫిదా.. గొప్పోడివి అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్..!

Pat Cummins : పిల్ల‌ల‌తో స‌ర‌దాగా..

త‌న అనుభ‌వాన్ని అంతా జోడించి ఎలా అయిన ఎస్ఆర్‌హెచ్‌కి క‌ప్ వ‌చ్చేలా కమ్మిన్స్ చేస్తాడ‌ని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. అయితే క‌మ్మిన్స్ సార‌థ్యంలోని స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు త‌న ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో గ‌నుక విజయం సాధిస్తే టాప్‌-2లో నిలిచే అవ‌కాశం ఉంది. అలా జ‌ర‌గాలంటే రాజ‌స్థాన్ త‌న చివ‌రి మ్యాచ్‌ను ఓడిపోవాల్సి ఉంటుంది. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌లో క‌మ్మిన్స్ పాత్ర చాలా ప్ర‌త్యేకం అని చెప్పాలి. పరిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా డెత్‌, మిడిల్ ఓవ‌ర్ల‌లో బౌలింగ్ చేస్తూ కీల‌క స‌మ‌యాల్లో వికెట్లు ప‌డ‌గొడుతూ ప్ర‌త్య‌ర్థుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.

అదే స‌మ‌యంలో త‌న బ్యాటింగ్ స్కిల్స్‌తోనూ భారీ స్కోర్ల‌లో త‌న వంతు సాయం చేస్తున్నాడు. జ‌ట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చ‌డం ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌కు ద‌గ్గ‌ర అయ్యాడు. క‌మ్మిన్స్‌కి మంచి మ‌న‌సు కూడా ఉంది. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను సంద‌ర్శించాడు. విద్యార్థుల‌తో ముచ్చ‌టించాడు. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఉన్న గ్రౌండ్‌లో పిల్ల‌ల‌తో క‌లిసి క్రికెట్ ఆడాడు. స్వ‌త‌హాగా ఆల్‌రౌండ‌ర్ అయిన క‌మిన్స్‌.. వికెట్ కీపింగ్ కూడా చేశాడు. త‌న బ్యాటింగ్‌తో పిల్ల‌ల‌ను అల‌రించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చిన్నారుల‌తో స‌మ‌యం గ‌డిపిన పాట్ క‌మిన్స్‌ను నెటిజ‌న్లు కొనియాడుతున్నారు.గొప్పోడివి సామి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts