KCR Brothers Son : కేసీఆర్ అన్న కొడుకుపై మ‌రో కేసు న‌మోదు.. ఎందుకిలా చేస్తున్నారు?

KCR Brothers Son : తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లిన త‌ర్వాత పార్టీకి చెందిన ప‌లువురిపై కేసులు న‌మోదు అవుతుండ‌డం రాజ‌కీయాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.అయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై బంజారాహిల్స్‌ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ శివారు ఆదిభట్ల భూవివాదానికి సంబంధించి కేసు నమోదు అయిన విష‌యం తెలిసిందే. తాజాగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ఫిర్యాదుతో .. కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుపై కిడ్నాప్‌, బెదిరింపు కేసు నమోదు చేశారు .

KCR Brothers Son : కేసీఆర్ అన్న కొడుకుపై మ‌రో కేసు న‌మోదు.. ఎందుకిలా చేస్తున్నారు?
KCR Brothers Son : కేసీఆర్ అన్న కొడుకుపై మ‌రో కేసు న‌మోదు.. ఎందుకిలా చేస్తున్నారు?

KCR Brothers Son : కేసీఆర్‌కి వ‌రుస దెబ్బ‌లు..

తనను కిడ్నాప్‌ చేసి హింసించారని ఐటీ ఉద్యోగి పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో కన్నారావుతో పాటూ మరో నలుగురిపై క్రిమినల్‌ కేసులు కేసును నమోదు చేశారు. బిందుమాధురి, శ్యామ్‌ప్రసాద్‌ మరికొందరితో కలిసి కన్నారావు స్కెచ్‌ వేశారని సాఫ్ట్వేర్‌ విజయ్‌వర్థన్‌రావు త‌న ఫిర్యాదులో తెలియ‌జేశాడు. స్థ‌ల వివాదం గురించి మాట్లాడుదామ‌ని చెప్పి ఇంటికి పిలిచి తనను ఇంట్లో బంధించి..బంగారం, నగదు ఎత్తుకెళ్లారని ఆయన ఆరోపిస్తున్నారు. తన వద్ద భారీగా నగలు, నగదు ఉన్నాయని నందిని అనే మహిళ ద్వారా కన్నారావుకు తెలిసిందన్నారు. దీంతో తనను గెస్ట్ హౌస్ లో నిర్బంధించి, డబ్బుల కోసం దాడి చేసిన‌ట్టు ఆయ‌న తెలియ‌జేశారు.

KCR Brothers Son : కేసీఆర్ అన్న కొడుకుపై మ‌రో కేసు న‌మోదు.. ఎందుకిలా చేస్తున్నారు?
KCR Brothers Son : కేసీఆర్ అన్న కొడుకుపై మ‌రో కేసు న‌మోదు.. ఎందుకిలా చేస్తున్నారు?

పోలీస్ అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసని, డబ్బులు ఇవ్వకుంటే జైలుకు పంపిస్తానని కన్నారావు బెదిరించినట్లు విజయవర్ధన్ వాపోయారు. దీంతో చేసేదేంలేక రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారు నగలను కన్నారావుకు అప్పగించినట్లుఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక విజయవర్ధన్ ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు.. కన్నారావు, నందినితో పాటు మొత్తం ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. 147,148,447,427,307,436,506,r/w149 IPC సెక్షన్ల కింద వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కన్నా రావు కోసం పోలీసులు లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. కన్నారావును అరెస్ట్ చేసిన పోలీసులు అతనిని రిమాండ్ కు తరలించనున్నట్టు స‌మాచారం.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday