Nandamuri Mokshagna : మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి ముహూర్తం ఖరారు? జూనియర్ ఎన్టీఆర్ రేంజ్‌కి ఎదిగే సత్తా ఉందా?

Nandamuri Mokshagna : నందమూరి మోక్షజ్ఞ.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరే ట్రెండ్. ఎందుకంటే.. నందమూరి వంశం నుంచి సినిమాల్లోకి రావాల్సిన వాళ్లలో ఇతడే లాస్ట్ హీరో. ఇంకా చాలామంది నందమూరి వంశం నుంచి వచ్చినా.. రావాల్సి ఉన్నా.. మోక్షజ్ఞకు ఉన్నంత హైప్ అయితే లేదు. దానికి కారణం.. మోక్షజ్ఞ.. నందమూరి బాలకృష్ణ కొడుకు కావడం.

Advertisement

nandamuri mokshagna getting ready for movie debut

Advertisement

బాలకృష్ణ అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు. సినిమాల్లో బాలకృష్ణ టాప్ హీరో. అలాంటి టాప్ హీరో కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటే ఆ మాత్రం హడావుడి ఉంటుంది కదా. నిజానికి బాలకృష్ణ కంటే కూడా మోక్షజ్ఞకు సినిమాలంటే పిచ్చి. తన తాత, తండ్రి.. ఇద్దరి సినిమాలు చూస్తూ పెరిగిన మోక్షజ్ఞ.. త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడట.

Nandamuri Mokshagna : మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే డైరెక్టర్ ఎవరు?

నిజానికి మోక్షజ్ఞ ఎప్పుడో సినిమాల్లోకి రావడానికి రెడీ అయ్యాడు. మేకోవర్ కూడా అయ్యాడు. ఇప్పుడు మిగిలింది ఓ డైరెక్టర్ చేతుల్లో పడటమే. కాకపోతే మోక్షజ్ఞను హీరోను చేసే బాధ్యతను బాలకృష్ణ ఎవరికి అప్పగిస్తాడు. ఏ డైరెక్టర్ కు అప్పగిస్తాడు అనేదే పెద్ద సస్పెన్స్.

డెబ్యూ మూవీ కాబట్టి ఖచ్చితంగా మంచి డైరెక్టర్ చేతుల్లో పడితేనే మోక్షజ్ఞకు భవిష్యత్తు ఉంటుంది. లేదంటే సినిమా అటు ఇటూ అయితే అది కెరీర్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అలాగే.. ఓ జానర్ లో సినిమా ఉండాలి. కథ ఏంటి? డైరెక్టర్, హీరోయిన్.. ఇలా ప్రతి ఒక్కటి ఆచి తూచి ఆలోచించి అడుగు వేయాలని బాలకృష్ణ భావిస్తున్నారట.

అందుకే తన తనయుడి సినిమా ఎంట్రీ కాస్త లేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం ఎండింగ్ లోపు మోక్షజ్ఞ సినిమా స్టార్ట్ చేయడం కోసం బాలయ్య పలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఈ సంవత్సరమే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉండబోతుందన్నమాట.

Author