Mohammed Siraj : ఇటీవల టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధించిన విషయం తెలిసిందే. ఈ కప్ కోసం టీమిండియా ఆటగాళ్లు చాలా కష్టపడ్డారు. టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా జట్టులో హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ విక్టరీ తర్వాత భారత్ కు చేరుకున్న టీమిండియా జట్టుకు క్రికెట్ అభిమానులంతా నీరాజనాలు పలికారు. ప్రధాని మోదీతోనూ అందరూ భేటీ అయ్యారు. ఆ తర్వాత ముంబైలో వరల్డ్ కప్ ట్రోఫీతో కలిసి పరేడ్ నిర్వహించారు. ఆ తర్వాత సిరాజ్ హైదరాబాద్ కు చేరుకోవడంతో ఇక్కడి క్రికెట్ అభిమానులు కూడా సిరాజ్ కు స్వాగతం పలికారు…
తాజాగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని.. మహమ్మద్ సిరాజ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ భేటీలో మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి పాల్గొన్నారు. ఈసందర్భంగా సిరాజ్ కు టీమిండియా జెర్సీని రేవంత్ రెడ్డి బహుకరించారు. టీ20 వరల్డ్ కప్ సాధించిన జట్టులో సిరాజ్ ఉన్నందుకు సిరాజ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అలాగే.. హైదరాబాద్ లో సిరాజ్ కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.