Medigadda Barrage : నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ.. డ్రోన్ వీడియో వైరల్

Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్టర్ ప్లాఫ్. నాణ్యత లేకుండా కట్టారు. భారీగా అవినీతి జరిగింది. లక్ష కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా అయింది అంటూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఎప్పుడైనా కూలిపోవచ్చు.

Advertisement

medigadda barrage with full of water video

Advertisement
Advertisement

ఎక్కడెక్కడి ఇంజినీర్లందరూ ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు, ఇంకా నీళ్లు వస్తే ఏమౌతుందో తెలియదు అంటూ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలను భయాందోళనకు గురి చేశారని.. ఇదంతా ఉత్తిదే.. మేడిగడ్డ బ్యారేజీ చూడండి నిండు కుండలా ఎలా ఉందో అంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కూలిపోయింది అనే తప్పుడు వార్తలను పటాపంచలు చేస్తూ నిండు కుండలా మేడిగడ్డ ప్రాజెక్టు ఉందని, దాని కెపాసిటీ 100 మీటర్లు కాగా ఇప్పటికే 92.40 కంటే ఎక్కువే నీళ్లు ఉన్నాయని.. టోటల్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3,40,00/3,41,000 క్యూసెక్కులుగా ఉందని.. 85 గేట్లకు 85 గేట్లను అధికారులు ఎత్తారని చెబుతూ.. డ్రోన్ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో కూడా మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండలా ఉంది. ప్రాజెక్టు మొత్తం నీళ్లతో నిండిపోయింది.

Author