Mahesh Babu : జస్ట్ వావ్.. ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం.. కల్కి మూవీపై మహేశ్ ప్రశంసల జల్లు

Mahesh Babu : ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం.. ప్రతి ఒక్కరు ఈ సినిమాలో బాగా నటించారు. నా మతి పోయింది. జస్ట్ వావ్. నాగ్ అశ్విన్.. నీ ఫ్యూచరిస్టిక్ విజన్ కు హేట్సాఫ్ అంటూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కల్కి సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.

Mahesh babu praises kalki 2898 ad movie

కల్కి సినిమా విడుదలై 10 రోజులు దాటినా ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వందల కోట్లను కొల్లగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఈ సినిమాకు నీరాజనాలు పలుకుతున్నారు. సినిమా సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందించారు. తాజాగా మహేశ్ బాబు కూడా ట్విట్టర్ లో సినిమా గురించి మెచ్చుకున్నారు.

Mahesh Babu : ప్రభాస్, దీపికను మెచ్చుకున్న మహేశ్

ఈ సినిమాలో నటించిన ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్.. అందరినీ మహేశ్ మెచ్చుకున్నారు. ఇలాంటి అద్భుతమైన సినిమాను తెరకెక్కించినందుకు వైజయంతి సినిమా వాళ్లకు కంగ్రాట్స్ అంటూ మూడు ట్వీట్స్ వదిలాడు మహేశ్.

Author