Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. గుంటూరు కారం సినిమా తర్వాత మహేశ్ బాబు రాజమౌళి సినిమా కోసం తన లుక్ ను కూడా పూర్తిగా మార్చేశాడు. ఆ సినిమా కోసం ప్రత్యేకంగా ట్రెయినింగ్ కూడా తీసుకుంటున్నాడు. అతడి సరికొత్త లుక్ చూసి సినీ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అబ్బా.. హాలీవుడ్ హీరోకు ఏమాత్రం తీసుపోడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు దేశమంతా అంబానీ మ్యారేజ్ గురించే మాట్లాడుకుంటోంది. ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా అనంత్ పెళ్లికి హాజరవుతున్నారు. ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఫ్యామిలీతో పాటు ముంబై వెళ్లాడు. తాజాగా మహేశ్ బాబు కూడా తన ఫ్యామిలీతో అనంత్ అంబానీ పెళ్లికి బయలుదేరాడు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ముంబైకి వెళ్తూ కెమెరా కంటికి మహేశ్ చిక్కాడు. దీంతో కెమెరాలు వెంటనే మహేశ్ కొత్త లుక్ ను తమ కెమెరాలో బంధించాయి.
Mahesh Babu : మహేశ్ న్యూ స్టైల్ అదుర్స్
మహేశ్ న్యూ స్టైల్ అదుర్స్ అంటూ మహేశ్ అభిమానులు తెగ సంబర పడుతున్నారు. హాలీవుడ్ హీరోకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న మహేశ్ న్యూ స్టైల్ చూసి తెగ సంతోష పడుతున్నారు. ఇక.. అనంత్ అంబానీ పెళ్లి ముంబైలోని బీకేసీలో ఉన్న జియో వరల్డ్ కాంప్లెక్స్ లో అత్యంత ఘనంగా జరుగుతోంది.
Superstar #MaheshBabu departs mumbai for #anantambaniwedding @urstrulyMahesh pic.twitter.com/FTKC2RZLnN
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) July 12, 2024