KL Rahul : కేఎల్ రాహుల్ పై మండిపడ్డ లక్నో ఓనర్ సంజీవ్ గోయేంకా… ఇంత అహంకారం అవసరమా…!

KL Rahul : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే లక్నో సూపర్ జెెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయేంకా పేరు బాగా వినిపిస్తోంది. అయితే ఇటీవల IPL 2024 ఐపిఎల్ 2024లో భాగంగా హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం Hyderabad uppal stadium వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ sunrisers hyderabad 10 వికెట్ల తేడాతో లక్నోపై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసేందుకు బరిలో దిగిన లక్నో అనంతరం బౌలింగ్ లో కూడా వెలవెలబోయింది. దీంతో లక్నో 166 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్ల లోనే ముగించి ఘనవిజయం సాధించారు. ఇక హైదరాబాద్ ఓపెనర్స్ ట్రాఫిక్ హెడ్ మరియు అభిషేక్ శర్మ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు. ఇక ఈ ఘోర పరాజయంతో లక్నో సూపర్ జెంట్స్ ఓనర్ సంజీవ్ తీవ్ర ఆగ్రహానికి లోనైనట్లుగా అర్థమవుతుంది. అయితే ఇటీవల ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ కు ఆయన కూడా హాజరుకాగా లక్నో ఓటమిని ఆయన తట్టుకోలేక పోయారు.

KL Rahul : కేఎల్ రాహుల్ పై మండిపడ్డ లక్నో ఓనర్ సంజీవ్ గోయేంకా... ఇంత అహంకారం అవసరమా...!
KL Rahul : కేఎల్ రాహుల్ పై మండిపడ్డ లక్నో ఓనర్ సంజీవ్ గోయేంకా… ఇంత అహంకారం అవసరమా…!

KL Rahul : కెప్టెన్ రాహుల్ పై ఆగ్రహం…

ఈ నేపథ్యంలోనే మ్యాచ్ ముగిసిన తర్వాత కేఎల్ రాహుల్ తో సంజీవ్ సీరియస్ గా చర్చిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వీడియోని గమనించినట్లయితే ఈ మ్యాచ్ ఒడిపోవడానికి గల ముఖ్య కారణం కేఎల్ రాహుల్ అన్నట్లుగా సంజీవ్ ప్రవర్తన చూసి అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ మ్యాచ్ పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సంజీవ్ పట్టించుకోలేదు. కోపంతో ఊగిపోతూ కేఎల్ రాహుల్ పై మండిపడుతున్న తీరు వీడియోలు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇక ఈ ఘటనతో కేఎల్ రాహుల్ ను కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

KL Rahul : గతంలో ధోని ఇప్పుడు కేఎల్ రాహుల్…

KL Rahul : కేఎల్ రాహుల్ పై మండిపడ్డ లక్నో ఓనర్ సంజీవ్ గోయేంకా... ఇంత అహంకారం అవసరమా...!
KL Rahul : కేఎల్ రాహుల్ పై మండిపడ్డ లక్నో ఓనర్ సంజీవ్ గోయేంకా… ఇంత అహంకారం అవసరమా…!

అయితే లక్నో ఓనర్ సంజీవ్ తన జట్టు కెప్టెన్ ను మందలించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఒకసారి టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ని సంజీవ్ ఇదే రీతిలో అవమానించడం జరిగింది. 2016లో జరిగిన ఐపిఎల్ సీజన్ లో ధోని సారథ్యంలో కొనసాగిన రైజింగ్ పూణే సూపర్ జేయింట్స్ పాయింట్ల పట్టికలో చివరి నుండి రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ధోనీని టీమ్ ఓటమికి బాధితుడిగా చేస్తూ ధోనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ధోని ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి స్టీవ్ స్మిత్ కు బాధ్యతలు అప్పగించాడు. అంతటితో ఆగకుండా ధోని గురించి ఆయన ఫిట్నెస్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. ఆ సమయంలో ఈ న్యూస్ ఐపీఎల్ లో చర్చానియాంశంగా మారింది. అంతేకాక ధోనీకి మేనేజ్మెంట్ కి మధ్య గొడవలు కూడా జరిగాయని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈసారి కె.ఎల్ రాహుల్ కి కూడా అదే పరిస్థితి ఉండబోతుందా అని అనిపిస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts