Krishi Bhagya Scheme : కృషి భాగ్య యోజన పథకం ద్వారా రైతన్నలకు శుభవార్త… దరఖాస్తు చేసుకుని సబ్సిడీ పొందండిలా…

Krishi Bhagya Scheme  : రైతు సోదరులకు శుభవార్త. తాజాగా కర్ణాటక ప్రభుత్వం వారి వ్యవసాయ వార్షిక వర్షపాతంపై ఆధారపడి ఉన్న రైతుల కోసం కృషి భాగ్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఎక్కువ శాతం వ్యవసాయ భూమి వర్షాధారం పైనే ఆధారపడి ఉండటం వలన పొడి భూములలో వ్యవసాయ కార్యకలాపాలు అస్థిర వర్షపాతం సమయంలో సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యవసాయానికి సాగునీరు అందే విధంగా కృషి భాగ్య పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే జిల్లాలోని తాలూకాలో వర్షాధార ప్రాంతాలలో లక్ష మందికి పైగా రైతులకు ప్రభుత్వం దాదాపు రూ.968.37 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది.

Advertisement
Krishi Bhagya Scheme : కృషి భాగ్య యోజన పథకం ద్వారా రైతన్నలకు శుభవార్త... దరఖాస్తు చేసుకుని సబ్సిడీ పొందండిలా...
Krishi Bhagya Scheme : కృషి భాగ్య యోజన పథకం ద్వారా రైతన్నలకు శుభవార్త… దరఖాస్తు చేసుకుని సబ్సిడీ పొందండిలా…

Krishi Bhagya Scheme  పథకం యొక్క లక్ష్యం…

ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం వ్యవసాయ రంగంలో విప్లవత్మక మార్పులను తీసుకురావడం. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా పొలంలో వర్షపు నీటి సంరక్షణ పద్ధతులను అవలంబించనన్నారు . అదేవిధంగా ఈ పథకం ద్వారా రైతులు నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించే దిశగా ప్రోత్సాహం అందించనున్నారు.

Advertisement

అయితే ఈ పథకాన్ని సగటున వర్షపాతం 450 మిల్లీమీటర్ల నుండి 850 మిల్లీమీటర్ల మధ్య ఉన్న వ్యవసాయ వాతావరణ మండలాలలో అమలు చేస్తారు. అనంతరం ఈ పథకం ఏడాదికి 45 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అమలు చేయబడుతూ వస్తుంది. ఇక ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది లక్ష మందికి పైగా రైతులు ప్రయోజనం పొందగలుగుతారు.ఇక ఈ పథకం ద్వారా రైతులు వర్షపు నీటిని రక్షించుకోవడానికి సరైన సదుపాయాలను నిర్మించుకోవడానికి మరియు నీటి సమస్య ఏర్పడినప్పుడు ఆ నీటిని బయటకు తీయడానికి లిఫ్ట్ పంపులు డీజిల్ మోటర్లు కొనుగోలుకు నగదు పొందవచ్చు. అలాగే తక్కువ నీటిని ఎక్కువ పంటలకు వినియోగించే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాజెక్టులో పొందుపరచనున్నారు.

ఇక ఈ పథకంలో కృషి హోమ్ అనేది వర్షపు నీటిని సేకరించెందుకు తవ్విన ఒక పెద్ద గొయ్యి. ఇక ఇది వేసవికాలంలో దాదాపు 5 ఎకరాల భూమికి సాగునీరును అందించడానికి ఎంతగానో సహాయపడుతుంది. కావున ఈ కృషి హోమ్ ను నిర్మించుకోవడానికి అవసరమయ్యే నిధులను మీరు పథకం ద్వారా పొందవచ్చు. ఇక ఈ పథకం ద్వారా ప్రయోజనాలను పొందాలంటే వ్యవసాయ శాఖ ప్రకారం 1 ఎకరం లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రైతులు వ్యవసాయ శాఖ లేదా రైత స్వకాస్ కేంద్రాలను సంప్రదించాల్సి ఉంటుంది.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది