Kirak RP : నువ్వేమన్నా ఆస్కార్ గెలిచి వచ్చావా… రోజాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ కిర్రాక్ ఆర్పీ… వీడియో !

Kirak RP : కిర్రాక్ ఆర్పీ గురించి మనందరికీ తెలిసిందే. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న ఆర్పీ ఆ తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు తన వ్యాపారాన్ని అనేక చోట్ల ప్రారంభిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కిర్రాక్ ఆర్పీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. అంతేకాక జబర్దస్త్ ఆర్టిస్టులు సుడిగాలి సుదీర్, హైపర్ ఆది , గెటప్ శీను కూడా పవన్ కళ్యాణ్ గెలుపును ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ ప్రముఖుల ఎంట్రీ చర్చనీయాంశంగా మారుతుంది. ఇక అధికార పార్టీ వైసీపీ తరఫున అతి తక్కువ సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నట్టు అర్థం అవుతుంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి రోజా మాట్లాడుతూ జబర్దస్త్ ఆర్టిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న రోజా మాట్లాడుతూ…జబర్దస్త్ ఆర్టిస్టులవి చిన్న చిన్న ప్రాణాలని , వారు సినిమా అవకాశాలు కోసం భయంతోనే జనసేన పార్టీ తరఫున ప్రచారాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అలా భయపడుతూ ప్రచారాలు చేసే వారి గురించి నేను మాట్లాడబోనని ,అలాగే రాజకీయ నాయకుల గురించి విమర్శలు చేసే జబర్దస్త్ ఆర్టిస్టులు కాస్త ఆలోచించి చేస్తే బాగుంటుందంటూ తెలియజేశారు. అయితే రోజా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై ఎవరు స్పందించలేదు కానీ తాజాగా కిర్రాక్ ఆర్పీ స్పందిస్తూ రోజాపై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Kirak RP : నువ్వేమన్నా ఆస్కార్ గెలిచి వచ్చావా... రోజాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ కిర్రాక్ ఆర్పీ... వీడియో !
Kirak RP : నువ్వేమన్నా ఆస్కార్ గెలిచి వచ్చావా… రోజాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ కిర్రాక్ ఆర్పీ… వీడియో !

Kirak RP నువ్వేమన్నా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నావా…

అయితే ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో భాగంగా కిర్రాక్ ఆర్పీ మాట్లాడుతూ….జబర్దస్త్ ఆర్టిస్టులపై రోజా చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. వారివి చిన్నచిన్న ప్రాణాలు అంటూ రోజా అన్నమాటలను గుర్తు చేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావి చిన్న చిన్న ప్రాణాల , చిన్నచిన్న ఆర్టిస్టులమా నువ్వేమైనా ఆస్కార్ అవార్డులు గెలుచుకుని వచ్చావా ఏంటి అంటూ ఆర్పీ రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గెటప్ శీను వేసిన గెటప్లలో ఒక్క గెటప్ కూడా రోజా చేయలేదని , సుడిగాలి సుదీర్ కు ఉన్న ఫాలోయింగ్ కూడా రోజాకి లేదని ఈ సందర్భంగా ఆర్పీ తెలిపారు. ఇక హైపర్ ఆది విషయానికొస్తే వాడు వచ్చిన తర్వాత జబర్దస్త్ చరిత్రనే మారిపోయిందని తెలియజేశారు.

వారందరీ ముందు నువ్వు అసలు నిలబడగలవా అంటూ రోజా ను ప్రశ్నించారు. మాకు మర్యాద ఇచ్చి మాట్లాడే వారికి మేము కూడా మర్యాద ఇస్తామని , మర్యాద లేకుండా మాట్లాడితే మేము కూడా అలాగే నడుచుకుంటామంటూ ఈ సందర్భంగా కిర్రాక్ ఆర్పీ తెలిపారు. మేము సైలెంట్ గా వచ్చి ప్రచారాలు చేస్తున్నప్పుడు మీరు కూడా అలాగే ఉంటే బాగుంటుందని , పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతోనే మేము ప్రచారాలు చేస్తున్నామని మధ్యలో మీరు దూరి ఇలాంటి మాటలు మాట్లాడటం మంచిది కాదు అంటూ హెచ్చరించారు. దీంతో ప్రస్తుతం కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మరి ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts