KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సడెన్ మీటింగ్.. కారణం అదేనా?

KCR : తెలంగాణలో ఓ వైపు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో బడ్జెట్ పై రేపు అంటే జులై 27న అసెంబ్లీలో చర్చ జరగనుంది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు అది ఒక బడ్జెటేనా అంటూ ఏకంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బడ్జెట్ పై జులై 27న చర్చ జరగనున్న నేపథ్యంలో కేసీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సడెన్ గా మీటింగ్ పెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ పెట్టడంపై కారణం ఏంటంటూ రాజకీయ విశ్లేషకులు తలగోక్కుంటున్నారు.

Advertisement

kcr sudden meeting with brs mlas

Advertisement

ఎర్రవెల్లిలో ఉన్న ఫామ్ హౌస్ లోనే ఈ మీటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీకి హాజరయినట్టు తెలుస్తోంది. అయితే.. రేపు బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

బడ్జెట్ పై అసెంబ్లీలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీని నిలదీయాలని కేసీఆర్.. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఇవాళ ఉదయమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన విషయం తెలిసిందే.

Author