Telangana DGP : తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ జితేందర్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా రవి గుప్త ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ను తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది ప్రభుత్వం.
జితేందర్.. ప్రస్తుతం తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన పదవి విరమణ కూడా దగ్గర పడింది. ఇంకో సంవత్సరంలో ఆయన రిటైర్ మెంట్ ఉన్న నేపథ్యంలో తెలంగాణకు ఆయన్ను డీజీపీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana DGP : పంజాబ్ కు చెందిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్
1992లో జితేందర్ ఐపీఎస్ బ్యాచ్ కి ఎంపికయ్యారు. ఆయన తొలి పోస్టింగ్ కూడా ఉమ్మడి ఏపీలోనే. ఏపీ కేడర్ కు ఎంపికైన జితేందర్.. నిర్మల్ ఏఎస్పీగానూ పనిచేశారు. ఆ తర్వాత పలు జిల్లాలకు ఎస్పీగా పని చేసి ఆ తర్వాత సీబీఐలో కొన్ని సంవత్సరాలు పని చేశారు. ఆ తర్వాత ఏపీలోనూ ఎన్ ఫోర్స్ మెంట్ లో పని చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ గానూ జితేందర్ పని చేశారు.