Janhvi Kapoor : తెలుగులో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ.. ఏ హీరోతో తెలుసా?

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. అందాల తార, అతిలోక సుందరి, దేవకన్య.. ఇలా ఎన్ని ఉపమానాలు వాడినా తన అందం ముందు తక్కువే. సాక్షాత్తు తన తల్లి అతిలోకసుందరి శ్రీదేవి మళ్లీ పుట్టిందా? అన్నట్టుగా అచ్చం తన తల్లి అందాన్ని పుణికిపుచ్చుకొని తల్లి మార్గంలోనే వెళ్తూ సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. జాన్వీ కపూర్ ఇప్పటి వరకు బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ లో స్టార్ హోదాను అనుభవిస్తోంది. కానీ.. ఇప్పటి వరకు తను తెలుగులో స్ట్రెయిట్ ఫిలిం ఒక్కటి కూడా చేయలేదు. ఎన్టీఆర్ దేవర సినిమాలో హీరోయిన్ గా తొలి సారి టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

janhvi Kapoor to act in nani movie in Tollywood

Advertisement

ఆ తర్వాత తనకు టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కడుతున్నాయి. దేవర సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమా తర్వాత జాన్వీ కపూర్.. రామ్ చరణ్ మూవీలో నటించబోతోంది. బుచ్చిబాబు ఈ సినిమాకు డైరెక్టర్. ఈ సినిమా తర్వాత మరో సినిమాలో కూడా జాన్వీ చాన్స్ కొట్టేసింది. అంటే ముచ్చటగా మూడో సినిమా కూడా కన్ఫమ్ అయిందట.

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమాలోనూ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీ హీరోయిన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రస్తుతానికి జాన్వీ కపూర్ చేతుల్లో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు రిలీజ్ అయితే ఇక తెలుగులో తను ఫుల్ బిజీ అయ్యే చాన్స్ ఉంది. టాలీవుడ్ దర్శకనిర్మాతలు తన కోసం క్యూ కట్టే అవకాశాలూ లేకపోలేదు.

Author