Jack Fruit : ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న జీవనశైలిలో కొన్ని ఆహార మార్పులు వలన ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతి రోజు కొన్ని రకాల పండ్లను తీసుకోవడం చాలా ముఖ్యం. పండ్లు అంటే అందరూ సహజంగా తీసుకుంటూ ఉంటారు. చాలామంది ఇష్టంగా తినే పండ్లలో పనస పండు కూడా ఒకటి ఉంటుంది. ఇది కూడా సీజన ల్ ఫ్రూటు. ఇది రుచిగా ఉండడమే కాదు. ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం ఈ పనసపండు. సంపూర్ణమైన ఆహారం దీనిలో విటమిన్ ఏ విటమిన్ సి బి-6తో పాటు తియామిన్, రీబో ప్లానిక్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, కాల్షియం, జింక్ ,ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ పనస పండులో ఉండే అధిక పొటాషియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ పండు బరువు తగ్గడానికి బెస్ట్ ఆహారం. ఎందుకంటే దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆహార కోరికలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది. జాక్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు వైరస్లనుండి రక్షిస్తుంది. పనస పండ్లు రకరకాల ఫైట్ న్యూట్రిమేన్ట్ ఉంటాయి.
Jack Fruit : థైరాయిడ్ సమస్యకు చెక్
పనస పండులో కాపర్ అధికంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ జీవక్రియలో ముఖ్యంగా హార్మోన్ ఉత్పత్తి శోషణలో ఉపయోగపడుతుంది. దీనిలోని ఖనిజ లవణాలు థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. థైరాయిడ్ పేసెంటు పనస పండు తింటే మంచి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడమే కాక. బరువును కంట్రోల్ చేస్తుంది. ఇనుము రక్తహీనతను కూడా తగ్గిస్తుంది.
Jack Fruit :ఆస్తమాకు చెక్
పనస పండు శరీరంలోని అసమతుల్యతను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ఫలితంగా ఆస్తమా ఎటాక్ ను కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా కాలుష్యం కారణంగా వచ్చే ఆస్తమా నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆస్తమా దాడులకు దారి తీసే కాలుష్యం కారణంగా శరీరంలో ఉత్పత్తి అవుతున్న ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది.
Jack Fruit : శరీరానికి తక్షణమే శక్తినిస్తుంది
100 గ్రాములు 94 కిలోల క్యాలరీలు మంచి కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పనసపండు తిన్న వెంటనే తక్షణ శక్తిని పొందవచ్చు. పనస పండులో చక్కెరలు చాలా తేలికగా జీర్ణం అవుతాయి.
Jack Fruit : గుండె ఆరోగ్యానికి మేలు
పనస పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం సమతుల్యతను కంట్రోల్ చేస్తుంది. శరీరంలో సోడియం లెవెల్స్ పెరిగితే ధమనులు గుండెకు హాని చేస్తాయి. పొటాషియం గుండె కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పనస పండులోని పొటాషియం రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. దాని వలన హైపర్ టెన్షన్ కంట్రోల్ చేస్తుంది.
Jack Fruit : ఎముకలను దృఢంగా మారుస్తుంది
పనస పండు అధిక మొత్తంలో కాల్షియం కలిగి ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. దీనిలోని పొటాషియం మూత్రపిండాల ద్వారా కాల్షియం నష్టాన్ని తగ్గిస్తుంది. పనసపండు తింటే ఆస్టియో పోరోసిస్ ప్రమాదం తగ్గుతుంది.
Jack Fruit : కంటి చూపు మెరుగుపడుతుంది
పనస పండ్లు విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కళ్ళ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. విటమిన్ ఏ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కళ్ళను కాపాడుతుంది. హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. వీటిని ఏ కిరణాలు హానికరమైన కాంతి తరంగాల నుంచి కళ్ళను రక్షిస్తుంది. ఇది కంటి చూపులు మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రెటీనా క్షీణతను తగ్గించడానికి ప్రవాంతంగా పనిచేస్తుంది.