IND vs ZIM : సత్తా చాటిన టీమిండియా.. రెండో టీ20లో జింబాబ్వేను చిత్తు చేసిన కుర్రాళ్లు

IND vs ZIM : టీమిండియా సత్తా చాటింది. జింబాబ్వేను చిత్తు చేసింది. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్ ఇటీవల ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయింది. దీంతో టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత్ కు అది ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. కానీ.. ఈసారి రెండో టీ20 మ్యాచ్ లో మాత్రం కుర్రాళ్లు అదరగొట్టేశారు. ఏకంగా 100 రన్స్ తేడాతో భారత్ గెలిచింది.

india wins against Zimbabwe in second t20

హరారేలో ఈ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లకు గాను 234 పరుగులు చేసింది. 2 వికెట్లను మాత్రమే నష్టపోయింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ సెంచరీ చేసి టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. ఆ తర్వాత గైక్వాడ్ హాఫ్ సెంచరీ చేశాడు.

IND vs ZIM : 134 పరుగులకే చేతులెత్తేసిన జింబాబ్వే

ఆ తర్వాత బ్యాటింగ్ లోకి దిగిన జింబాబ్వే 134 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 18.4 ఓవర్లకే జింబాబ్వే ఆల్ అవుట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం టీమిండియాకు ప్లస్ పాయింట్ అయింది. భారత బౌలర్లు అవేశ్ ఖాన్ 3 వికెట్లు, బిష్ణోయ్ 2 వికెట్లు, ముకేశ్ 3 వికెట్లు తీశారు.

Author