T20 World Cup 2024 Final : మరి కొద్దిగంటలలో ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లలో ఏ జట్టు జగజ్జేతగా నిలుస్తుందోనని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వెస్టిండీస్‌లోని బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు మొత్తం 3 మ్యాచ్‌లు ఆడింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఈ మైదానంలో మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఇక్కడ ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ, 2010లో ఈ మైదానంలో వెస్టిండీస్‌పై 14 పరుగులతో, ఆస్ట్రేలియాపై 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరి ఈ రోజు జరగనున్న ఫైనల్స్‌లో ఏం చేస్తుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
T20 World Cup 2024 Final వరుణుడి గండం..
అయితే ఈ రోజు జరగనున్న మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే సెమీఫైనల్ తరహాలోనే ఈ బిగ్ ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. కరీబియన్‌లో ప్రస్తుతం వర్షం కాలం కావడంతో రోజు వర్షాలు పడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ జరిగే బ్రిడ్జ్ టౌన్‌లోనూ వర్షాలు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ జరిగే సమయంలో 70 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ వర్షం అంతరాయంతో శనివారం మ్యాచ్ జరగకపోతే ఆదివారం నిర్వహిస్తారు. ఆదివారం కూడా వర్షం పడే అవకాశాలున్నాయి. దాంతో ఆట నిర్వహణ కోసం 190 నిమిషాలు అదనపు సమయాన్నీ రెండు రోజులకు కేటాయించారు. ఐసీసీ నాకౌట్ రూల్స్ ప్రకారం ఇరు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడితేనే ఫలితాన్ని తేల్చుతారు.
రిజర్వ్ డేతో కలుపుకొని కటాఫ్ సమయంలో ఇరు జట్లు 10 ఓవర్లు ఆడకపోతే మ్యాచ్‌ను రద్దు చేస్తారు. అప్పుడు ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. వర్షం కారణంగా శనివారం మధ్యలోనే మ్యాచ్ ఆగిపోతే.. రిజర్వ్‌డే అయిన ఆదివారం అక్కడి నుంచే ప్రారంభిస్తారు.ఒకవేళ ఆ రోజు మ్యాచ్ సాధ్యం కాకపోతే రెండు జట్లని విజేతగా ప్రకటిస్తారు. జూన్ 30 ఆదివారం నాడు 50 నుంచి 60 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం ఉంది.