కొంతమందికి గవర్నమెంట్ పనులు ఆలస్యంగా అవుతాయి. అయితే వీరు అధికారుల అనుగ్రహాన్ని పొందడం ఎలా…? మరి ఎటువంటి పరిహారాలు చేస్తే వీరి పనులు పూర్తవుతాయి…? ఈ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం… చాలామంది ప్రభుత్వ వ్యవహారాలలో పనులు కాక ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ అధికారుల అనుగ్రహాలను పొంది వారితో పని చేయించుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. స్థలం విషయం అలాగే ఒక ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ వేసి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. లోన్స్ అప్లై చేస్తే అప్రూవల్ కాకపోవడం, కొంతమంది కాంట్రాక్టులకు గవర్నమెంట్ నుంచి బిల్లులు రాక ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీటి అన్నిటికీ కారణం జాతకరీత్యా ఉండే గ్రహ స్థితుల కారణం.
అలాగే వారి పేరు వారి పేరులో ఉండే రాంగ్ నెంబరు అలాగే పేరులో ఉండే నెగటివ్ ఎనర్జీ ఏదో ఒకటి వీరికి అడ్డుపడుతూ ఉంటుంది. మీరు ఎంత దైవ భక్తులైన సరే ఏదో రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇలా ఇబ్బంది పడేవారు ప్రతి గురువారం ఆదివారం దేవాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి. గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి గుడికి లేదా సాయిబాబా గుడికి లేదా శివాలయానికి గాని వెళ్లాలి. ఆదివారం సుబ్రమణ్య స్వామి గుడికి లేదా లక్ష్మీనరసింహస్వామి గుడికి శివాలయానికి గాని వెళ్లాలి. మాకు ఏ పని జరగడం లేదు గవర్నమెంట్ చుట్టూ జరుగుతున్నాము అనేవారు ప్రతి గురువారం ఆదివారం గుడికి వెళ్లడం అలవాటు చేసుకోవాలి. ఇంకా మీ సమస్య భరించలేని విధంగా గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి.
బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి వర్క్ పెండింగ్లో ఉంది. నాకు రావాల్సింది పెండింగ్లో ఉంది నేను ఇవ్వాల్సిందే పెండింగ్లో ఉంది. ఇలా ఇబ్బంది పడుతున్నారు అనుకునేటట్టు వారు అధికారుల అనుగ్రహాన్ని పొందడానికి అమ్మవారి మంత్రాన్ని లలిత సహస్రనామంలో అమ్మవారి మంత్రం ఒకటి ఉంటుంది. దీన్ని ప్రతిరోజు 108 సార్లు , లేదా 54 సార్లు , లేదా 21సార్లు ,జపం చేయాలి. అలాగే అమ్మవారి అనుగ్రహని పొందాలి అనుకుంటే ఈ మంత్రాన్ని ” ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః రాజ కృప రాజపేట నివేశితం రాజ్యలక్ష్మి కోసనాధా చతురంగబలేశ్వరిరాజ్యలక్ష్మి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః” ఈ మంత్రాన్ని గురువారం లేదా ఆదివారం ఒక మంచి రోజు చూసుకొని మొదలు పెట్టాలి. ఈ ప్రక్రియను 41 రోజులు చేయాలి. అలాగే ఈ 41 రోజుల్లో వచ్చే గురువారాలు ఇదే మాత్రంతో కుంకుమ అర్చన చేయాలి. ఇలా చేసిన తర్వాత తాలింపు శనగలను నివేదంగా సమర్పించి మీ కోరికలను అమ్మవారికి వినిపించండి. అప్పుడు అమ్మ వారి అనుగ్రహాన్ని తొందరగా లభిస్తుంది.