Aadhaar Card : ఫోన్ నెంబర్ లింక్ లేకున్నా.. ఓటీపీ లేకుండా ఆధార్ ఇలా డౌన్ లోన్ చేసుకోండి..!

Aadhaar Card  : మన దేశంలో ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బర్త్ సర్టిఫికెట్ దగ్గరి నుంచి ప్రభుత్వ పథకాలు వరకు.. విద్య నుంచి వైద్యం వరకు.. కూలీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఇలా అన్నింటికీ ఆధార్ కార్డు ఎంతో ముఖ్యం. అది లేకుంటే ఒక్క పని కూడా కాదంటే నమ్మండి. అంతెందుకు ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలన్నీ సరే ఆధార్ కార్డు తప్పనిసరి. మరి అలాంటి ఆధార్ కార్డు విషయంలో కొందరు తప్పులు చేస్తుంటారు. ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ లేకుండా ఉన్న వారు ఎంతో మందిఉన్నారు.

Advertisement
Aadhaar Card : ఫోన్ నెంబర్ లింక్ లేకున్నా.. ఓటీపీ లేకుండా ఆధార్ ఇలా డౌన్ లోన్ చేసుకోండి..!
Aadhaar Card : ఫోన్ నెంబర్ లింక్ లేకున్నా.. ఓటీపీ లేకుండా ఆధార్ ఇలా డౌన్ లోన్ చేసుకోండి..!

అంతే కాకుండా కేవైసీ లాంటివి అప్ డేట్ చేయించుకోని వారు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి వారి ఏపథకానికి అర్హులు కారు అనుకుంటే పొరపాటే. అలాంటి వారు కూడా ఇప్పుడు అన్ని రకాల పథకాలకు అర్హులే. ఎందుకంటే ఎలాంటి ఫోన్ నెంబర్ లింక్ లేకున్నా, ఓటీపీ లేకుండా ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎలాగే ఇప్పుడు తెలుసుకుందాం.ఆధార్ కార్డును ముందుగా డౌన్ లోడ్ చేసుకోవడం కోసం గూగుల్ లేదా క్రోమ్ లోకి వెళ్లాలి. అందులో UIDAI అధికారిక వెబ్‌సైట్ పేరును సెర్చ్ చేసి, దానిపై క్లిక్ చేయాలి.

Advertisement

 అక్కడ మీకు ఏ భాషకావాలో ఎంచుకోవాలి.

– తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్ మెనూలో ‘‘My Aadhar ’’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
– అక్కడ మీకు ‘‘Download Aadhar’’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కొంచెం కిందకు వస్తే అక్కడ ‘ఆర్డర్ ఆధార్ రీప్రింట్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి.
– తర్వాత వచ్చే పేజీలో మీరు ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయండి.
– తర్వాత మీకు అక్కడ క్యాప్చా కనిపిస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సమర్పించాలి.

Aadhaar Card : ఫోన్ నెంబర్ లింక్ లేకున్నా.. ఓటీపీ లేకుండా ఆధార్ ఇలా డౌన్ లోన్ చేసుకోండి..!
Aadhaar Card : ఫోన్ నెంబర్ లింక్ లేకున్నా.. ఓటీపీ లేకుండా ఆధార్ ఇలా డౌన్ లోన్ చేసుకోండి..!

-తర్వాత వచ్చే పేజీలో ‘నా మొబైల్ నెంబర్ రిజిస్ట్రర్ చేయబడలేదు’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
– ఆ ఫోన్ నెంబర్ ప్లేస్ లో మీ వేరే నెంబర్ లేదా ఎప్పుడూ ఇవ్వని నెంబర్ ను ఎంటర్ చేయాలి.
-అప్పుడు మీరు ఎంబర్ చేసిన కొత్త నెంబర్ కు ఓటీపీ వస్తుంది.
– ఆ ఓటిపిని ఎంటర్ చేసి, క్లిక్ చేస్తే చాలు ఆధార్ కార్డును ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday