Tulsi Leaves : ప్రస్తుత కాలంలో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది ఈ డయాబెటిస్ సమస్యను సహజంగా తగ్గించుకోవడానికి అనే రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే డయాబెటిస్ ను సహజంగా తగ్గించుకోవాలని ప్రయత్నించేవారికి తులసి ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. అయితే వాస్తవానికి తులసి మన శరీరం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అందుకే ప్రతిరోజు 5 నుంచి 7 తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం రోగాల బారిన పడకుండా ఉండడంలో తులసి ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇంతటి ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ తులసి ఆకులు కొలెస్ట్రాల్ మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులకు నిజంగా దివ్య ఔషధం అని చెప్పవచ్చు. దీనిలో ఉండే అనేక రకాల ఔషధ గుణాలు ఈ సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి. మరి తులసి వలన మన ఆరోగ్యానికి జరిగే వివిధ రకాల ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Tulsi Leaves రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి…
ప్రతిరోజు తులసి ఆకులు తీసుకోవడం వలన క్యాన్సర్ ,గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు వంటివి తగ్గుతాయట. మరీ ముఖ్యంగా ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలోని చక్కెరను సైతం నియంత్రించగలదు. అలాగే తులసిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తులసి ఆకులసారం ఎంతగానో ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలలో రుజువైంది. కావున ప్రతిరోజు తులసి ఆకులు తీసుకోవటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
Tulsi Leaves రక్తపోటు…
ప్రస్తుత కాలంలో చాలామంది ఒత్తిడి ఆందోళన కారణంగా వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే తులసిలో వీటిని తగ్గించే సమ్మేళనాలు అధికంగా ఉన్నాయి. ప్రతిరోజు తులసి ఆకులు తీసుకోవడం వలన డిప్రెషన్ కు తక్కువగా గురవుతారు. అలాగే తులసి ఆకులు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తద్వారా యూజినల్ రక్తపోటును తగ్గించడంలో తులసి ఆకులు ఎంతగానో సహాయపడతాయి. దీనివలన గుండె జబ్బులు కూడా చాలా వరకు తగ్గుతాయి.
మానసిక ఆరోగ్యం…
ఆయుర్వేదంలో తులసి ఆకులను మూలికలుగా పరిగణించడం జరుగుతుంది. ఇక ఈ ఆకులు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి ప్రతిరోజు తులసి ఆకులు తీసుకోవడం చాలా మంచిది.
చర్మ సమస్యలకు చెక్…
చర్మ సమస్యలతో బాధపడే వారికి తులసి ఆకులు ఎంతగానో సహాయ పడతాయి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ,గుండె , క్యాన్సర్ , శ్వాస కోస సమస్యలతో పాటు చర్మవ్యాధులతో పోరాడడానికి ఎంతగానో సహాయపడతాయి.
జీర్ణ వ్యవస్థ…
ప్రతిరోజు తులసి ఆకులను తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని పలు అధ్యయనాలలో రుజువైంది. అందుకే ఆరోగ్య నిపుణులు సైతం ప్రతిరోజు తులసి ఆకులను తీసుకోమని చెబుతున్నారు. అంతేకాక బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ తులసి నీరు తాగడం ఎంతగానో సహాయపడుతుంది. కావున ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 3 నుండి 8 తులసి ఆకులను తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు