Harish Rao : నోరు జారి వాస్తవాలు బయటపెట్టిన హరీష్ రావు…!

Harish Rao : కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే మనం నోరు జారి పలు విషయాలను బయటపెడుతుంటాం. అయితే సామాన్యులు విషయం పక్కన పెడితే ప్రముఖులు, సెలబ్రిటీలు , రాజకీయ నాయకులు ఇలా నోరు జారితే మాత్రం అనేక రకాల వాస్తవాలు వెలుగులోకి వచ్చేస్తాయి. అందుకే చాలామంది చాలా సందర్భాలలో ఆలోచించి మాట్లాడతారు.మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు కానీ వారి మాటల యొక్క అసలు అర్థం మాత్రం వేరేలా ఉంటుంది. అది వారి లోపలి విషయాలను బయటపెట్టే విధంగా ఉంటుంది. అయితే తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలు కూడా కాస్త అలాగే ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో భారత రాష్ట్ర సమితి నుండి పెద్ద సంఖ్యలో నాయకులు ఎమ్మెల్యేలు,ఎంపీలు చివరికి టికెట్లు పొందిన అభ్యర్థులు సైతం అధికార పార్టీలోకి వెళ్లేందుకు మోగ్గుచూపుతున్నారు.ఈ నేపథ్యంలోనే హరీష్ రావు వీరిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవికాస్త ఇప్పుడు రాజకీయ వర్గాలలో దుమారం లేపుతున్నాయి. ఇంతకీ హరీష్ రావు ఏమన్నారు అనే విషయానికి వస్తే…తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను కొనగలరు తప్ప ఉద్యమకారులను కొనలేరు అంటూ చెప్పుకొచ్చారు. తద్వారా ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని ఆరోపణలు ఆయన చేస్తున్నారు. అయితే హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్లో బీఆర్ఎస్ పతనం అవడానికి ప్రధాన కారణం ఉందని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఆ విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సాధన కోసం పోరాడిన వారందరినీ బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టిందని ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది.

Harish Rao : నోరు జారి వాస్తవాలు బయటపెట్టిన హరీష్ రావు...!
Harish Rao : నోరు జారి వాస్తవాలు బయటపెట్టిన హరీష్ రావు…!

ఇక ఎన్నికలు రాగానే డబ్బులు ఉన్న వారిని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మాత్రమే కేసీఆర్ అవకాశం ఇచ్చారు. రాష్ట్ర సాధన పూర్తయిన తర్వాత ఆయనకు ఉద్యమకారులు మాత్రం కనిపించలేదు.ఇక తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు సమానంగా పోరాడిన , కొన్ని సందర్భాలలో తన కంటే కీలకంగా మారిన వ్యక్తి ,పార్టీలను ఏకతాటి పైకి తీసుకువచ్చిన కోదండరాం లాంటి వారిని కూడా కేసీఆర్ కరివేపాకుల పక్కన పెట్టేసారని వార్తలు ఉన్నాయి. ఇక కింది స్థాయి ఉద్యమకారుల సంగతి పక్కన పెడితే శ్రీకాంతాచారి కుటుంబానికి ఏం జరిగిందో మనందరికీ తెలుసు.

అయితే ఇప్పుడు హరీష్ రావు కూడా తన మాటల ద్వారా ఇదే సంగతిని తెలిసేలా చేస్తున్నారని ప్రజలు తలుస్తున్నారు.రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే కొనగలడు అనే మాటలలో మరో అర్థం ఏంటంటే…ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేయకుండా పక్కన పెట్టిందని విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ జెండాలు మోయడానికి వాడుకుని తప్ప వారిని ఎదవనివ్వలేదనే వాదన ప్రజల నుంచి వినిపిస్తుంది.మెజారిటీ అవకాశవాదులకు ఎమ్మెల్యే పదవులు ఇవ్వడం వలన ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని అలాకాకుండా ఉద్యమకారులను నెత్తిన పెట్టుకుని వారికి అవకాశం ఇచ్చి ఉంటే ఇప్పుడు రాజకీయం వేరేలా ఉండేదని చెబుతున్నారు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday
లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది