ICC T20 Rankings : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ తాజాగా విడుదల చేసింది. ఆల్ రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా నెంబర్ వన్ గా నిలిచాడు. ఇక.. బౌలింగ్ లో 7,8వ స్థానాల్లో అక్షర్, కులదీప్ నిలిచారు. 12, 13 స్థానాల్లో బుమ్రా, అర్ష్ దీప్ నిలిచారు.
ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాండ్యా ఆటతీరును అందరం చూశాం. దీంతో ఆయన రెండు పాయింట్లు పెరిగి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. నిజానికి.. శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ టాప్ ప్లేస్ లో ఇప్పటి వరకు ఉండేవాడు. తాజాగా ఆ స్థానాన్ని హార్దిక్ పాండ్యా చేజిక్కించుకున్నాడు.
ఆల్ రౌండర్స్ జాబితాలో హార్దిక్ పాండ్యా తర్వాత టాప్ టెన్ లో చోటు సంపాదించిన వాళ్లలో వనిందు హసరంగ, స్టోయినిస్, రజా, అల్ హాసన్, నబి, దీపేంద్ర సింగ్, లివింగ్ స్టోన్, ఐడెన్, అలీ ఉన్నారు. అలాగే.. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో మన వాళ్లకు టాప్ 20 లో నాలుగు స్థానాలు దక్కాయి. తొలి స్థానంలో ఆదిల్ రషీద్ ఉన్నాడు