Gramin Dak Sevak GDS Posts : పది పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే పోస్టాఫీసులో 44 వేల ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా

Gramin Dak Sevak GDS Posts : పోస్టల్ శాఖలో భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. పోస్టల్ శాఖలో 44 వేలకు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి గ్రామీణ్ డాగ్ సేవక్(జీడీఎస్) పోస్టులు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈరోజు అంటే 15 జులై 2024 నుంచి ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం), డాగ్ సేవక్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి పరీక్ష ఉండదు. కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగం లభిస్తుంది.

Advertisement

gramin dak sevak gds posts in Indian post

Advertisement

కాకపోతే పదో తరగతిలో గణితం, ఆంగ్లం, అభ్యర్థులు ఏ రాష్ట్రానికి చెందిన వారు అయితే ఆ రాష్ట్ర స్థానిక భాషలో చదివి ఉండాలి. దానితో పాటు కాస్త కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్ తొక్కగలితే సామర్థ్యం ఉండాలి. ఈ పోస్టుల కోసం కనీసం 18 ఏళ్లు నిండిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 40 ఏళ్ల లోపు వయసు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Gramin Dak Sevak GDS Posts : ఏపీలో 1355, తెలంగాణలో 981 పోస్టులు

దేశవ్యాప్తంగా 44 వేల పోస్టులు భర్తీ చేయనుండగా.. ఏపీలో మొత్తం 1355 పోస్టులు భర్తీ చేయనున్నారు. అందులో ఓపెన్ క్యాటగిరీలో 656, ఓబీసీ వాళ్లకు 200, ఎస్సీ వాళ్లకు 177, ఎస్టీ వాళ్లకు 88, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 194, పీడబ్యూడీ ఏ క్యాటగిరీలో 6, బీ క్యాటగిరీలో 20, సీ క్యాటగిరీలో 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 981 పోస్టులు ఖాళీగా ఉండగా.. అందులో 454 పోస్టులు ఓపెన్, 210 ఓబీసీ, 145 ఎస్సీ, 54 ఎస్టీ, 97 ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్లు పోస్టల్ అధికారిక వెబ్ సైట్ https://indiapostgdsonline.cept.gov.in/ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోండి.

Author