Game Changer : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ మూవీ వచ్చేది అప్పుడే..!

Game Changer : త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్‌ Ram charan రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను దక్కించుకున్నాడు. దాని తర్వాత కూడా ఆయన పేరు ఇప్పటికీ అంతర్జాతీయ స్టేజిలపై వినిపిస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్‌ ఎవరితో సినిమా చేస్తాడని అంతా ఆరాతీశారు. ఎవరూ ఊహించని విధంగా రామ్ చరణ్‌ సంచలన దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తున్నాడు. శంకర్ అంటే ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టర్. ఆయనతీసే సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Game Changer : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ మూవీ వచ్చేది అప్పుడే..!
Game Changer : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ మూవీ వచ్చేది అప్పుడే..!

Game Changer : బర్త్ డే కు సాంగ్ రిలీజ్..

అలాంటి పెద్ద డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశం రామ్ చరణ్‌ కు రావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సినిమాను ప్రకటించి రెండేళ్లు కావస్తోంది. కానీ ఇంకా ఎలాంటి అప్ డేట్లు మొన్నటి వరకు రాలేదు. అప్పట్లో ఒక టైటిల్ పోస్టర్ Game Changer ను మాత్రమే రిలీజ్ చేశారు. ఆ తర్వాత మొన్న మళ్లీ రామ్ చరణ్‌ బర్త్ డేకు ఓ సాంగ్ ను విడుదల చేశారు. అంతే అంతకు మించి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే వస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఉంటుందని మెగాఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు.

వారి అంచనాలను నిజం చేసే విధంగా రామ్ చరణ్‌ మూవీ గేమ్ ఛేంజర్ పై తాజాగా నిర్మాత దిల్ రాజు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లతో సమావేశంలో మాట్లాడారు. ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అయిందని.. ఈ ఏడాదిలోనే ఉంటుందని చెప్పారు. డైరెక్టర్ చెప్పిన తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామంటూ స్పష్టం చేశారు. అయితే దిల్ రాజుకు అత్యంత సన్నిహితులు చెబుతున్న మాట ప్రకారం వచ్చే దీపావళికి సినిమాను రిలీజ్ చేస్తున్నారంట. దీపావళికి ఒకరోజు ముందే లేదా దీపావళి రోజునే సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Game Changer : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ మూవీ వచ్చేది అప్పుడే..!
Game Changer : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ మూవీ వచ్చేది అప్పుడే..!

దీపావళికి మూడు రోజుల వరకు సెలవులు ఉంటాయి కాబట్టి.. పండగ సీజన్ ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ డేట్ ను లాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అటు దసరాకు, సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఉన్నాయి కాబట్టి.. దీపావళికి గేమ్ ఛేంజర్ వస్తున్నట్టు చెబుతున్నారు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday