Revanth Reddy : రాష్ట్ర కేబినెట్ విస్తరణ, వాళ్ళకే రేవంత్ పెద్దపీట…?

Revanth Reddy : తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కేబినెట్ విస్తరణ చేయనుందనే వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే నెల మొదటి వారంలో విస్తరణ చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ కీలక నాయకత్వం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో కేబినేట్ లో ఎవరికి చోటు దక్కే అవకాశం ఉందనే దానిపై విస్త్రుత చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ని అధికారంలోకి తెచ్చిన సిఎం రేవంత్ రెడ్డి, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ప్రభావం చూపించారు. భారత రాష్ట్ర సమితిని పూర్తిగా చర్చల్లో లేకుండా చేసిన ఆయన ఇప్పుడు కేబినేట్ విస్తరణ మీద దృష్టి పెట్టారు.

Revanth Reddy : రాష్ట్ర కేబినెట్ విస్తరణ, వాళ్ళకే రేవంత్ పెద్దపీట...?
Revanth Reddy : రాష్ట్ర కేబినెట్ విస్తరణ, వాళ్ళకే రేవంత్ పెద్దపీట…?

కేబినేట్ లో గతంలో తనతో కలిసి తెలుగుదేశం పార్టీలో పని చేసిన వారికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని, అలాగే మండవ వెంకటేశ్వరరావును మళ్ళీ కేబినేట్ లోకి తీసుకు రావాలని రేవంత్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మండవను… శాసన మండలికి పంపి, తద్వారా మంత్రిని చేసేందుకు రేవంత్ ఇప్పటికే సిద్దమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. మండవకు ఖమ్మం ఎంపీ సీటు ఇస్తారనే వార్తలు వచ్చినా అది నిజం కాదని తేలింది. రేవంత్ తో ఆయన ముందు నుంచి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు.

ఇక మరో కీలక నేతకు కూడా ఆయన మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. కడియం శ్రీహరి మీద కూడా రేవంత్ దృష్టి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తన టీంగా కొందరిని కేబినేట్ లో ఉంచుకుని వారికి కీలక శాఖలు కట్టబెట్టాలనే భావనలో రేవంత్ ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక బీఆర్ఎస్ ను పూర్తిగా లేకుండా చేసేందుకు కూడా రేవంత్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారని, ఆ పార్టీ నుంచి ఓడిపోయిన కొందరిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి నామినేటెడ్ పదవులు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారని, ఈ క్రమంలోనే తనతో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కలిసి పని చేసిన ఒంటేరు ప్రతాపరెడ్డితో చర్చలు జరుపుతున్నారని సమాచారం.

Author