Vitamin P : విటమిన్ P గురించి ఎప్పుడైనా విన్నారా… ఇది ఏ ఆహారంలో దొరుకుతుందంటే …??

Vitamin P : మనం తీసుకునే ఆహారంలో ఎన్నో రకాల విటమిన్ లు ఉంటాయి. ఈ విటమిన్లు అన్నీ కూడా మన ఆరోగ్యానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి. వాటిలో కొన్నిటికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఉంటే,మరీ కొన్నింటి గురించి మనకు తెలియదు. అలాంటి వాటిలో విటమిన్ p కూడా ఒకటి. విటమిన్ A,B,C,D ఈ విటమిన్ ల గురించి మనం ఎక్కువగా వింటూనే ఉంటాం. కానీ విటమిన్ p అనేది ఒకటి ఉంది అని చాలా మందికి తెలియదు. విటమిన్ p లోపం వలన ఎన్నో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కావున విటమిన్ p కలిగి ఉన్న ఆహారాలను ప్రతిరోజు తీసుకోవటం చాలా అవసరం. విటమిన్ p అంటే ఏమిటి. ఈ విటమిన్ p అనేది ఏ ఆహారంలో దొరుకుతుంది. దాని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. విటమిన్ p అనేది కచ్చితంగా విటమిన్ కాదు. ఫ్లేవనాయిడ్స్ విటమిన్ p అని కూడా అంటారు. ఫ్లేవనాయిడ్స్ అనగా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ ప్రాపర్టీలు కలిగిన ఒక ఫైటో న్యూట్రియంట్.

సింపుల్ గా చెప్పాలి అంటే. ఈ విటమిన్ p అనేది ఎక్కువగా మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలలో ఉంటుంది. బయో ఫ్లేవనాయిడ్ లోపం లక్షణాలు విటమిన్ p లాగే ఉంటాయి. అతి పెద్ద లక్షణాలు సులభంగా గాయాలు, రక్తస్రావం, దెబ్బ తగిలినచోట అధికంగా రక్తం కారటం లాంటివి జరుగుతాయి. దీని లోపం వలన ఆర్థరైటిస్ కు సంబంధించిన వాపుకు కూడా ఒక కారణం అవుతుంది. దీని తీవ్రమైన లోపం వలన చిగుళ్ళు, దంతాల సమస్యలు, చర్మం,జుట్టు పొడిబారటం, రక్తహీనత లాంటివి వస్తాయి. విటమిన్ p తీసుకోవటం వల్ల గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. రక్తనాళాల పనితీరు కూడా ఎంతో బాగుంటుంది. విటమిన్ p అనేది యాంటీ ఆక్సిడెంట్ల కూడా పనిచేస్తుంది. కావున రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆస్తమా, కీళ్లవాతం, అలర్జీలు కూడా రాకుండా ఉంటాయి.. వారికోస్ వీన్స్ చర్మంపై కమిలి నట్లు ఉండటం లాంటివి రాకుండా రక్షిస్తుంది. కంటి శుక్లాలు రాకుండా, చూపు అనేది తగ్గకుండా కూడా చేస్తుంది.

బ్రెయిన్ పనితీరు కూడా ఎంతో మెరుగుపడుతుంది. కొన్ని రకమైన క్యాన్సర్లు అనేవి రాకుండా కూడా చేస్తుంది. అయితే క్యాన్సర్ పై ఈ విటమిన్ p పై ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. నిమ్మ జాతికి చెందినటువంటి పండ్లలో ఈ విటమిన్ p అనేది ఎక్కువగా ఉంటుంది. హై క్వాలిటీ డార్క్ చాక్లెట్ లో కూడా ఇది ఉంటుంది. కాకపోతే చాక్లెట్ లో కోకో అనేది 70 శాతం వరకు ఉండాలి. బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ ఇలా బెర్రీ జాతికి చెందినటువంటి అన్ని పండ్లల్లో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. రెడ్ వైన్, ఆకుకూరల్లో కూడా ఇది ఎక్కువగా లభిస్తుంది. ఎన్నో ముదురు రంగు పండ్లు మరియు కూరగాయల రంగుకు ఫ్లేవనాయిడ్ లు అంటే విటమిన్ p కూడా ఒక కారణం. ఈ సమ్మేళనాలలో ఆలివ్ ఆయిల్, బెర్రీలు, ఉల్లిపాయలు, కాలే, ద్రాక్ష, టమాటాలు, రెడ్ వైన్,టీ, కోకో, యాపిల్స్, సోయాబీన్స్, మరియు సోయా ఉత్పత్తులు, స్ట్రో బెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్బెర్రీలు మొదలైన పండ్లలో విటమిన్ p అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా ఇతర రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు మీ డైట్ లో గనక చేర్చుకుంటే మీకు కావలసిన విటమిన్స్ అన్ని కూడా లభిస్తాయి…

Author