Womens : బల్లి మీద పడితే మంచిది కాదనే మాట మన పెద్దల నుండి మనం వింటూనే ఉన్నాం. చాలామంది బల్లి పడితే వెంటనే బంగారం పట్టుకోవాలని చెపుతుంటారు. అలాగే బల్లి మీద పడితే ఆశుభం గా భావిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శరీరంలోని కొన్ని భాగాలపై బల్లి పడితే ఎనలేని అదృష్టం కలిసి వస్తుందట. కొన్ని భాగాలపై పడినప్పుడు అది దరిద్రానికి దారితీస్తుందట. అలాంటి సమయంలో ఖచ్చితంగా పరిహారాలు పాటించాలని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఏ ఏ భాగాల పై బల్లి పడితే మంచిది..?పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Womens : బల్లి పడితే మంచిదేనా…?
స్త్రీలకు ఎడమ స్థలాన బల్లి పడితే మంచిది కాదు అని పురాణాలు చెబుతున్నాయి. దీనివలన అన్న వస్త్రాలకు లోటు వస్తుంది.ఒకవేళ స్త్రీలకు కుడి స్థలాల పైన బల్లి పడితే అది మంచి జరుగుతుందని అర్థమట. అనవసరాలకు లోటు ఉండదు. అలాగే ఆడంబరమైన ఆభరణాలను వస్తువులను ధరిస్తారని నమ్మకం. స్తన ఆగ్రమందు బల్లి పడితే అత్యంత శుభకరం. దానివల్ల దాన, కనక ,వస్తువు, వాహనాలు అన్నీ కూడా లభిస్తాయి.ధన లాభం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మగవారికి పిరుదుల పైన బల్లి పడితే సుఖసంతోషాలు ఉంటాయి. ఎడమ పిరుదుల పైన పడినట్లయితే ధన లాభం ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. అరికాలు మీద ఒక బల్లి పడితే పేరు ప్రతిష్టలు వస్తాయి. సన్మానాలు అధికార లాభాలు వస్తాయి.లింగం పైన బల్లి పడినట్లయితే ధన ,ధాన్య సమృద్ధి,సంతాన ప్రాప్తి కలుగుతుంది.అలాగే లింగము పై భాగాన బల్లి పడినట్లు అయితే దాంపత్య సౌఖ్యం ఉంటుంది. లింగం పైన ఉన్నటువంటి రోమాల పైన బల్లి పడినట్లయితే, దేశ దిమ్మిరై తిరుగుతాడు.ఆసనం పైన గాని బల్లి పడితే మంచిది శుభాలు జరుగుతాయి. వృషణాలు పైన బల్లి పడితే దాంపత్య సౌఖ్యం నశిస్తుంది.
Womens : పరిహారాలు…
తలంటు స్నానాలు చేయాలి.
అలాగే దేవునికి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
దేవుని దగ్గర ఉప్పు, మిరియాలు బియ్యం తో నైవేద్యం సమర్పించాలి.
అవి లేకపోతే పండ్లు తీసుకెళ్లి దేవుడికి ఇవ్వాలి. దీనిని గుడిలో ఆయన చేసుకోవచ్చు ఇంట్లో అయినా చేసుకోవచ్చు.
కంచి వెళ్లి బంగారపు బల్లిని ముట్టుకోవచ్చు ఒకవేళ వెళ్లలేని వారు ఉంటే వెళ్లి వచ్చిన వారిని ముట్టుకోవచ్చు.