Sravana Sukravaaram : శ్రావణమాసం పరమశివుడికి అత్యంత ప్రియతమైనా మాసం. మహాదేవుని ఆరాధించడానికి స్వామి ఆశీర్వాదాలు పొందడానికి శ్రావణమాసం చాలా ఉత్తమమైనది. ఈ సంవత్సరంలో ఆగస్టు మాసం అమావాస్య తర్వాత 9వ తేదీ నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ శ్రావణ మాసాలలో ఏ నియమాలను పాటించాలి…? ఏ పనులు అస్సలు చేయకూడదు..? అనే నియమాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
హిందువులందరూ శ్రావణమాసాన్ని పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసం మంగళవారం నుండి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మహిళలు దోసిట్లో శనగల మూట కాళ్లకు పసుపు రాసుకోవడం చేతులకి తోరణాలు కట్టుకోవడం పట్టు చీరలు బంగారు నగలు గాజులు ఆభరణాలు అంతా కూడా పండుగ వాతావరణంలా కనిపిస్తుంది. అయితే ఈ మాసంలో ప్రతి ఒక్కరి ఇల్లు కళకళలాడుతూ కనిపిస్తుంది. ఈ మాసంలో మహిళలు చాలామంది గౌరీ పూజలు చేస్తూ ఉంటారు. సాధారణంగా చంద్రగ్రహణ నివారణకు గౌరీ పూజ లలిత పూజలు చేస్తూ ఉంటారు. ఈ మాసంలో వచ్చే శుక్రవారం నాడు లలిత అమ్మవారికి పూజ చేసుకుంటేే మంచిదని పండితులు చెబుతున్నారు. శ్రావణమాసంలో వచ్చే సోమవారం రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. ఈ రోజున పరమశివుడిని పూజించి పార్వతి దేవికి కుంకుమ పూజలు చేస్తారు. అలాగే వారి ఇంటి దేవుళ్లకు మొక్కులను చెల్లించుకుంటారు.
అలాగే వరలక్ష్మీ వ్రతాన్ని రెండో శుక్రవారం చేస్తారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ధనంతో పాటు ప్రేమ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. శ్రావణమాసంలో వచ్చే శనివారాలలో తమ ఇంటి ఇలవేల్పు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి హారతులు ఇవ్వడం. చలివిడిని నైవేద్యంగా పెట్టడం వంటివి చేస్తారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడే అన్నా చెల్లెలకి అనుబంధంగా రాఖీ పౌర్ణమి నీ జరుపుకుంటారు. శ్రావణమాసం మహాదేవుడైన శివుడికి అంకితం. చాలామంది ఈ మాసం అంతా కూడా ఉపవాసాలు చేస్తారు. అలాగే ఈ మాసంలో శాఖాహారానికి మాత్రమే పరిమితమై ఉంటారు. అలాగే శాఖాహారంలో కొన్ని పదార్థాలు మాత్రమే భుజించాలని హిందూ పురాణం చెబుతుంది. హిందూ శ్రావణమాసంలో కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
హిందూమత గ్రంథాలలో శ్రావణమాసం అంతా కూడా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే ఆకు కూరలో తినకూడదని చెప్పబడుతుంది. అలాగే వంకాయ కూరను తినకూడదు. ఎందుకంటే వంకాయ మలినాలతో కూడిన ఆహారమని చెబుతారు. అలాగే శ్రావణ మాసంలో పచ్చిపాలను తాగకూడదు. ఒకవేళ తాగాలి అనుకునేవారు పాలను బాగా మరిగించిన తర్వాత తాగాలి. హిందూమతంలో ఉల్లిపాయలను వెల్లుల్లి భుజించకూడదు. అలాగే మద్యం సేవించడం హిందూ మతంలో ఒక నిషేధం గా ఉంది. ఇది మనిషిలో ప్రతికూల శక్తిని పెంచుతుంది. అలాగే శ్రావణమాసంలో ఆడ చేపలు తమ కడుపులో గుడ్లను కలిగి ఉంటాయి. వాటిని చంపడం మహాపాపం. అందుకనే హిందువులు ఈ మాసంలో చేపలకు మాంసానికి దూరంగా ఉంటారు.
Sravana Sukravaaram పూజా విధానం
మీరు ఈ మాసంలో శివుని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే భక్తితో స్వామికి స్వచ్ఛమైన నీటిని సమర్పించండి. అలాగే బెల్వపత్రాకులతో పూజ చేయండి. పాలు పెరుగు గంగా నీరు మరియు తేనెతో శివలింగానికి అభిషేకం చేయండి. ఈ శ్రావణమాసంలో శివుని ఆరాధించేే సమయంలో తులసి ఆకులను మాత్రం వాడవద్దు. అలాగే కొబ్బరి నీళ్లతో కూడా అభిషేకం చేయకూడదు. ఈ శ్రావణమాసంలో మీ కోరికలను నెరవేర్చుకునేందుకు ప్రతిరోజు ఉదయం 21సార్లు మంత్రాలను జపిస్తూ ఉంటే శుభ ఫలితాలు ఉంటాయి.