Praneet Hanumanth : ప్రణీత్ హనుమంతు ఎవరో తెలుసా.. ఐ.ఏ.ఎస్ కొడుకయ్యుండి ఇంత దారుణంగా ఎలా..?

Praneet Hanumanth : గత రెండు రోజులుగా ప్రణీత్ హనుమంతు పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. ఒక యూట్యూబర్ గా ట్విట్టర్ స్పేస్ లో కొందరితో కలిసి అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఐతే వాళ్లు మిగతా విషయాలు ఎలా మాట్లాడినా ఏమో కానీ సినిమా గురించి రివ్యూస్ ఇస్తూ వీళ్లేద్మో పెద్ద తోపులు అన్నట్టు చేస్తుంటారు. ఐతే అది కూడా ఒక సమీక్షలో భాగమే అనుకోవచ్చు కానీ లేటెస్ట్ గా తండ్రి, కూతురు వీడియో గురించి అసభ్యకరంగా మాట్లాడి సంచలనంగా మారారు…..

Advertisement
Praneet Hanumanth : ప్రణీత్ హనుమంతు ఎవరో తెలుసా.. ఐ.ఏ.ఎస్ కొడుకయ్యుండి ఇంత దారుణంగా ఎలా..?
Praneet Hanumanth : ప్రణీత్ హనుమంతు ఎవరో తెలుసా.. ఐ.ఏ.ఎస్ కొడుకయ్యుండి ఇంత దారుణంగా ఎలా..?

ట్విట్టర్ లో రెండు రోజుల నుంచి వైరల్ అవుతున్న ఈ వీడియోపై హీరో సాయి ధరం తేజ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. తెలంగాణా, ఏపీ పోలీసులు ఈ విషయం మీద యాక్షన్ తీసుకోవాలని కోరారు. తెలంగాణా పోలీసులు ఆల్రెడీ ప్రణీత్ హనుమంతు మీద ఫోక్సో కేసు పెడతామని అన్నారు. ఐతే ఈ విషయంపై మంచు మనోజ్ కూడా స్పందించాడు. ఇలాంటి వారికి సమాజంలో తిరిగే హక్కు లేదని అన్నారు. కచ్చితంగా వీరికి శిక్ష పడాలని అన్నారు. చివరా నిన్ను వదిలేది లేదు తమ్ముడు అంటూ వార్నింగ్ ఇచ్చారు మంచు మనోజ్…

Advertisement

Praneet Hanumanth ఐ.ఏ.ఎస్ కొడుకు నుంచి ఇలాంటి కామెంట్స్

ఇంతకీ ఇంత దుర్మార్గంగా ఆలోచించిన ప్రదీప్ హనుమంతు ఎవరు అంటే ఒక విద్యావంతుడైన ఐ.ఏ.ఎస్ కొడుకు. యూట్యూబర్ గా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న అతను ఇలానే తనకు నచ్చినట్టుగా మాట్లాడి నెటిజెన్లను ఇబ్బంది పెడుతుంటాడు. మరి విషయం ట్విట్టర్ నుంచి పోలీసుల దాకా వెళ్లింది కాబట్టి కచ్చితంగా వారు చేయాల్సింది చేస్తారని చెప్పొచ్చు.

ఐతే ఈ విషయంపై నిస్సుగ్గుగా మళ్లీ ఒక స్పెషల్ వీడియో చేశాడు ప్రణీత్ హనుమంతు. తాము డార్క్ కామెడీగా ఆ కామెంట్స్ చేయాలనుకున్నాం కానీ అది వేరేలా వెళ్లింది. ఇది కచ్చితంగా తప్పే.. ఇలాంటివి ఇక మీదట రిపీట్ అవ్వదు. తప్పుజరిగింది క్షమించండి అని చెప్పాడు ప్రణీత్ హనుమంతు. ఐతే ఇలాంటి వాడిని ఒక్కసారి పోలీసులకు అప్పచెబితేనే సెట్ రైట్ అవుతారని సోషల్ మీడియాలో కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పి హనుమంత్ ఇటీవల వచ్చిన సుధీర్ బాబు హరోం హర సినిమాలో కూడా నటించాడు.

Author