Silent : ప్రతిరోజు ఒక 10 నిమిషాల పాటు మౌనం పాటిస్తే అద్భుతం జరుగుతుందట…!

Silent  : కొంతమంది నోటిలో స్పీకర్ ఉన్నట్లుగా గలగల నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు. ఏదో ఒక విషయంలో రోజు మొత్తం మాట్లాడుతూనే ఉంటారు. ఇలా మాట్లాడటం వల్ల ప్రజల శరీరంతో పాటు మనసు మెదడుని ప్రభావితం చేస్తాయి. ఇది మన ఒత్తిడిని కూడా పెంచే అవకాశాలుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో రోజుకి కనీసం 10 నిమిషాల పాటు మౌనంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మీరు ప్రశాంతంగా ఉండడానికి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ఒక గొప్ప వరం. ప్రతి మత సంస్కృతిలో ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండడానికి ప్రాముఖ్యత ఇచ్చింది. చాలామంది దీనికి మతపరమైన పేరు కూడా పెట్టారు. అందరూ దీన్ని జీవన విధానంగా చెప్తారు.

Silent : ప్రతిరోజు ఒక 10 నిమిషాల పాటు మౌనం పాటిస్తే అద్భుతం జరుగుతుందట...!
Silent : ప్రతిరోజు ఒక 10 నిమిషాల పాటు మౌనం పాటిస్తే అద్భుతం జరుగుతుందట…!

ధ్యానం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చాలామంది మనస్తత్వలు ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఏకాగ్రతను పెంచుకోవడానికి సానుకూల ఆలోచనలు పెంచడానికి ప్రతిరోజు పది నిమిషాలు మౌనంగా ఉండాలని చెప్తున్నారు. మౌనంగా చేసే ధ్యానం మన మెదడుకి కొత్త శక్తిని ఇస్తుంది. ఇది మన మనసుకి ఎంతో ప్రశాంతంగా ఇస్తుంది. కొంత సమయం పాటు మౌనంగా ఉండడం వలన మన మెదడు కణాలు పునరుత్పత్తిని మార్చుకుంటాయి. దీనివలన మన మెదడు పనితీరు మెరుగవుతుంది. జీవితంలో ధ్యానం కచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. దాని వలన ఒత్తిడి మానసిక సమస్యల నుంచి బయటపడడానికి మౌనంగా ఉండడమే ఉత్తమమైన మార్గం మౌనంగా చేసే ధ్యానంతో శరీర మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ప్రతిరోజు 30 నిమిషాలు ధ్యానం చేయడంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ధ్యానంతో నిద్రలేమి సమస్యతో ఉపశమనం పొందవచ్చు. ధ్యానం చేయడంతో అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. మనం కొంత సమయం మౌనంగా ఉన్నప్పుడు మనతో మాట్లాడుకునే అవకాశం కూడా మనం పొందవచ్చు. ఆ సమయంలో మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇది మన మనసుని ప్రశాంతంగా మెదడుని విశ్రాంతిగా ఉంచుతుంది.. పది నిమిషాల పాటు మౌనం పాటిస్తూ ధ్యానం చేస్తే మన తో మనం మాట్లాడుకోవచ్చు… శరీరానికి విశ్రాంతి ఇచ్చినట్లు అవుతుంది. అనారోగ్య సమస్యలు కూడామీ దరిచేరువు..

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday