Heinrich Klassen : క్లాసన్ క్లాసిక్ బ్యాటింగ్… ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడుగా…!

Heinrich Klassen : ఎట్టకేలకు భారతదేశంలో ఐపీఎల్ సీజన్ రానే వచ్చింది…అయితే ఎన్నడూ లేని విధంగా ఐపిఎల్ చరిత్రలో హైదరాబాద్ ఫాన్స్ ఫుల్ జోష్ లొ ఉన్నారు. అయితే గత ఐపీఎల్ సీజన్ 2023లో ఆడిన 14 మ్యాచ్ లలో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీవీలో మ్యాచ్ చూసే వారు సైతం పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు.అయితే ఆ సీజన్ లెక్క వేరు ఈ సీజన్ లెక్క వేరు అని అనిపిస్తుంది.

అవును ఇప్పుడు రోజులు మారాయి. సన్ రైజర్స్ టీం పూర్తిగా మారింది. జెర్సీ కూడా మారింది. కెప్టెన్ కూడా మారాడు.అవన్నీ ఒక ఎత్తు అయితే హేన్రిచ్ క్లాసన్ కూడా మారాడు అని చెప్పాలి.ఎందుకంటే ప్రత్యర్థి బౌలర్లను క్లాసన్ మడత పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఇదే సంభాషణ హైదరాబాద్ టీమ్ ఫాన్స్ మధ్య విపరీతంగా నడుస్తుంది.

అయితే ఈ సంభాషణలకు ప్రధాన కారణాలలో ఒకటి… మైదానంలో మాస్ బ్యాటింగ్ చేస్తున్న హెన్రిచ్ క్లాసన్ అని చెప్పాలి. అయితే ఈ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో సన్రైజర్స్ టీం ను గెలుపు అంచుల వరకు తీసుకువెళ్లిన క్లాసన్ కేవలం 29 బంతుల్లో 8 సిక్సర్లుతో మొత్తం 63 పరుగులు చేసి తాను వచ్చాను అని నిరూపించాడు.

Heinrich Klassen : క్లాసన్ క్లాసిక్ బ్యాటింగ్... ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడుగా...!
Heinrich Klassen : క్లాసన్ క్లాసిక్ బ్యాటింగ్… ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడుగా…!

Heinrich Klassen క్లాసన్  బీభత్సం

అనంతరం ముంబై ఇండియన్స్ తో జరిగిన రెండో మ్యాచ్ లో మరింత చెలరేగి 34 బందులో 80 పరుగులు చేసి 4 ఫోర్లు 7 సిక్స్ లతో బీభత్సం సృష్టించాడు. అయితే కోల్ కత్తా తో జరిగిన మ్యాచ్ లో క్లాసన్ స్ట్రైక్ రేట్ 217 కాగా, ముంబై ఇండియన్స్ తో ఆడిన మ్యాచ్ లో అధికాస్త 235 కు చేరింది. ప్రత్యర్థి టీమ్ నుంచి బంతి పడటం ఆలస్యం స్టేడియంలో ప్రేక్షకుల కళ్ళతో పాటు కేమెరాలు సైతం బౌండరీ వైపు ఆసక్తిగా చూశాయి.

అయితే వాస్తవానికి 2018 లోనే ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన క్లాసన్ ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడడం జరిగింది. ఆ తర్వాత 2019లో బెంగళూరు తరఫున కూడా క్లాసన్ ఆడడం జరిగింది. అనంతరం కరోనా రావడంతో క్లాసన్ ఫ్రాంచేజి కూడా పరిగణలోకి తీసుకోలేదు.

ఈ నేపథ్యంలోనే 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో క్లాసన్ చేరాడు. ఇక ఆ సీజన్ లో బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో 52 బంతుల్లో సెంచరీ సాధించి ఒక్కసారిగా క్లాసన్ ఫ్రాంచేజి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆ సీజన్ లో మొత్తం 12 మ్యాచ్ లలో ఆడిన క్లాసన్ 448 పరుగులతో సన్ రైజర్స్ టీం లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Heinrich Klassen : క్లాసన్ క్లాసిక్ బ్యాటింగ్... ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడుగా...!
Heinrich Klassen : క్లాసన్ క్లాసిక్ బ్యాటింగ్… ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడుగా…!

ఇక 2024 సీజన్ లో మరోసారి క్లాసన్ పై సన్రైజర్స్ కన్నేసింది. దీనిలో భాగంగానే 5.25 కోట్లు పెట్టి సన్రైజర్స్ హైదరాబాద్ క్లాసన్ దక్కించుకుంది. మరి ఈ సీజన్ లో ఇప్పటికే ప్రత్యర్థి టీమ్ లకు చెప్పాల్సిన విషయాలను చెప్పేసిన క్లాసన్ రాబోయే మ్యాచ్లలో ఇంకెలాంటి విధ్వంసం సృష్టిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఐపిఎల్ సీజన్ లో క్లాసన్ పేరు పై ఎన్ని రికార్డులు నమోదు అవుతాయో వేచి చూడాల్సిందే. ఇక క్లాసన్ ఇదే ఫామ్ కొనసాగిస్తే మాత్రం హైదరాబాద్ ఈసారి కచ్చితంగా కప్పు కొడుతుందని చెప్పాలి.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday