AP Rains : భారీ వర్షాల ఎఫెక్ట్.. మునిగిన దేవిపట్నం గండిపోచమ్మ టెంపుల్

AP Rains : ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ ఎగువ కురుస్తున్న వర్షాల వల్ల గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాని వల్ల గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్రిడ్జి వద్ద నీటిమట్టం 10.2 అడుగులకు చేరుకుంది. దీంతో గోదావరి నీటిని డెల్టా కాలువకు అధికారులు విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి కూడా నీటిని పంపిస్తున్నారు అధికారులు.

devipatnam gandi pochamma temple drown in rains

మరోవైపు దేవిపట్నం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గండి పోచమ్మ అమ్మ వారి ఆలయం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఇంకోవైపు 30వ జాతీయ రహదారి వద్ద అల్లూరి జిల్లా చట్టి వద్ద శబరి నది వరద నీరు చేరడంతో ఏపీ, తెలంగాణ మధ్య, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి.

హైవే 326 పైకి కూడా వరద నీరు చేరింది. దీని వల్ల ఒడిశా, ఆంధ్రా మధ్య రాకపోకలు నిలిచాయి. అలాగే.. విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరిగింది. బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి చెందిన 14 గేట్లను అధికారులు వదిలారు. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 97 వేలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది.

Author