Padi Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది. ఆయనపై భారత్ న్యాయ సంహిత చట్టం కింద కు నమోదు అయింది. నిజానికి.. ఈ చట్టం అమలులోకి వచ్చి ఒక్క రోజు కూడా కాలేదు. అప్పుడే ఈ చట్టం కింద కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది.
భారత్ న్యాయ సంహిత చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు అయిన తొలి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మంగళవారం జరిగిన జెడ్పీ సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై జిల్లా పరిషత్ సీఈవో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221, 126(2) కింద కేసు నమోదు చేశారు.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని సమావేశం నుంచి బయటికి వెళ్లకుండా అడ్డుకొని ఆమె ముందు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బైఠాయించారు. దీంతో ఆయనపై ఈ కేసు నమోదయింది.
నియోజకవర్గంలో విద్యా శాఖ అధికారులతో తాను మీటింగ్ పెడితే.. ఎంఈవో, ఇతర హెచ్ఎంలను పిలిచి మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ డీఈవో.. ఎంఈవోను సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్యే జెడ్పీ సమావేశంలో మండిపడిన విషయం తెలిసిందే.
వెంటనే డీఈవోను సస్పెండ్ చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా.. కలెక్టర్ పట్టించుకోకపోవడంతో కలెక్టర్ ముందు భైఠాయించి న్యాయం చేయాలని కోరడంతో కలెక్టర్ ను బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.