GHMC Mayor : బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ ఆగ్రహం.. రాజీనామా చేయాలని పట్టుబట్టిన కార్పొరేటర్లు

GHMC Mayor : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు నినాదాలు చేశారు. మేయర్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ మేయర్ పోడియం చుట్టుముట్టారు. మేయర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

corporators protest against ghmc mayor vijayalaxmi

మీరు వెళ్లండి.. సంతాపం తెలుపుదాం. సంతాపం పెడదాం అని మేయర్ ఎంత చెప్పినా బీఆర్ఎస్ కార్పొరేటర్లు వినలేదు. నా పోడియం మీద చేతులు వేయకండి.. అంటూ మేయర్ కార్పొరేటర్లపై సీరియస్ అయ్యారు. చివరకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ తమ స్థానాలకు వెళ్లి కూర్చున్నారు.

ఆ తర్వాత బీజేపీ కార్పొరేటర్లు కూడా మేయర్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. మీరంతా కోఆపరేట్ చేయాలి. మీరు సంతాపం చేయాలన్నందుకు మనం సంతాపం ప్రకటిద్దాం. ఇది పూర్తయ్యాక మీరెవరూ పోడియం ముందుకు రావద్దు.. మెంబర్స్ అందరూ మీకు చెప్పుకునే రైట్ ఉంది. కానీ.. అజెండా ప్రకారం మనం వెళ్దాం. ఆరు నెలల నుంచి కౌన్సిల్ సమావేశాలు జరగలేదు. రెండేళ్ల నుంచి ఏ పనులు కాలేదు. ఆరు నెలల నుంచి మనకి ఎన్నికల కోడ్ ఉంది.. అన్నారు.

అంతకుముందే జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ పార్టీ మారి.. కాంగ్రెస్ లో చేరారు. దానిపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. వెంటనే మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన మేయర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు.

Author