Coconut Water : కొబ్బరి నీళ్లు ఈ సమయంలో తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు చూసి ఆశ్చర్యపోతారు…!

Coconut Water : సమ్మర్ లో ఎక్కువగా పానీయాలు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందులో ఎక్కువగా ప్రతి ఒక్కరు కొబ్బరి నీళ్లను తాగుతారు.. ఎందుకంటే కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం ఉంటుంది. కాబట్టి వేసవిలో శరీరాన్ని హైడెడ్ గా ఉంచుకోవాలి. అందుకే ఎక్కువగా మంచినీళ్లు జ్యూస్ లు తాగడం వలన డీహైడ్రేషన్ బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.. అందుకే వేసవిలో జ్యూస్ ఫ్రూట్స్ కొబ్బరినీళ్లు లాంటివి తీసుకోవడం చాలా అవసరం. కొబ్బరి నీళ్లు తాగితే శరీరాన్ని డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.. ముఖ్యంగా కొబ్బరినీళ్లు డీహైడ్రేషన్ బారి నుంచి రక్షించడంలో ఉపయోగపడతాయి. ఈ నీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సహజ ఎంజైములు పొటాషియం లాంటి ఖనిజాలు కూడా ఉంటాయి. కానీ చాలామంది దీనిని తాగేటప్పుడు చాలా పొరపాట్లు చేస్తుంటారు. అయితే కొబ్బరి నీరు తాగడానికి సరైన సమయం ఏది? వేసవికాలంలో ఎప్పుడు తీసుకోవాలి అనే అనుమానాలు ఉంటాయి.

Advertisement
Curd : సమ్మర్ లో ప్రతిరోజు పెరుగు తింటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!
Curd : సమ్మర్ లో ప్రతిరోజు పెరుగు తింటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!

ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరి నీళ్లు పొటాషియానికి మంచి మూలం అలాగే విటమిన్ సి, మెగ్నీషియం ఎన్నో ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని గొప్ప లక్షణం ఏమిటంటే దీని తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడదు.. సహజంగా వేసవిలో డిహైడ్రేషన్ గురవుతూ ఉంటారు. కాబట్టి కొబ్బరి నీరు పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి నీళ్లు శరీరానికి ఎలక్ట్రోలైట్ అందించడానికి సహకరిస్తుంది. అలాగే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. కొబ్బరినీళ్ళతో రెట్టింపు ఉపయోగాలు పొందాలంటే కొన్ని పదార్థాలను దీనిలో నానబెట్టి తీసుకోవాలి. అంటే అవి చియా గింజలు రాత్రంతా కొబ్బరి నీళ్ళు నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

Advertisement
Curd : సమ్మర్ లో ప్రతిరోజు పెరుగు తింటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!
Curd : సమ్మర్ లో ప్రతిరోజు పెరుగు తింటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!

ఇది రోగ నిరోధక శక్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మంచి అల్పాహారంగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్ళు ఎప్పుడు ఏ సమయంలో తాగాలి. కడుపుతో మంచినీళ్లు తాగితే మంచిదని కొందరు మధ్యాహ్నం పూట తాగడం మేలు చేసిందని కొందరు అంటూ ఉంటారు. అయితే కొబ్బరి నీళ్లు తాగడానికి ఉత్తమ సమయం ఉదయమే అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది భోజనంతో లేదా తర్వాత తీసుకోకూడదు. కడుపు మంటతో ఇబ్బంది పడేవారు ఖాళీ కడుపుతో కొబ్బరి తాగాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదయాన్నే వీటిని తాగడం వలన జీవక్రియ మెరుగుపడుతుంది. ఇంకా బరువు తగ్గడానికి మేలు చేస్తుంది. కానీ కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు కొబ్బరినీళ్ళను అసలు తాగకూడదు. అతిగా తాగితే కిడ్నీలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts