Vishwambhara : బింబిసారను మించిన కథతో చిరంజీవి విశ్వంభర.. మెగాస్టార్ ఫ్యాన్స్‌కి పూనకాలే ఇక

Vishwambhara : ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రమే. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ ఆషికా రంగనాథన్ కూడా నటిస్తోంది. ఈ సినిమాలో పెద్ద పెద్ద నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా వచ్చిన అప్ డేట్స్ చూస్తే మెగాస్టార్ ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయం అనే చెప్పుకోవచ్చు.

Advertisement

Chiranjeevi vishwambhara movie latest updates

Advertisement

ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందట. ఇంకా రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆగస్టు నెలాఖరు లోగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా షూటింగ్ తో పాటు జరుగుతోంది. విశ్వంభరను 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇది మైథాలజీలో ఉన్న లోకాలన్నింటి చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఇది సరికొత్త ప్రపంచాన్ని చూపించే కథ అని అంటున్నారు. ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ కూడా తెగ కష్టపడుతోంది. మెగాస్టార్ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చేందుకు వశిష్ట టీమ్ సిద్ధమవుతోంది.

Author