Castor Oil Plant : మనం ఉండే ప్రదేశంలో మన చుట్టూ ఉండే ఆవరణలో ఎన్నో మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో మనకి ఉపయోగపడే మొక్కలు చాలా ఉంటాయి. కానీ వాటి గురించి చాలామందికి తెలియకపోవచ్చు. అలాంటి మొక్కలలో ఒకటి ఆముదం మొక్క. ఆముదం ఆకులు, ఆముదం విత్తనాలు చాలా ఉపయోగపడతాయి. ఆముదం తీసి మార్కెట్లో మంచి ధరకు అమ్ముతారు. ఈ నూనె జుట్టు ఒత్తుగా, నల్లగా చేస్తుంది. అలాగే ఇది చాలా సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. భారతదేశంలో పురాతన కాలం నుండి ఔషధ పద్ధతులను వినియోగించబడుతున్నాయి. ఇటువంటి మొక్కలు మన చుట్టూ ఎన్నో ఉంటాయి. అయితే ఇప్పుడు మనం వాటిని ఉపయోగించడం మర్చిపోయాం. ఆముదం మొక్క కూడా అంతే ఇది ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలను కలిగిస్తుందట.
Castor Oil Plant ఆముదం నూనె వల్ల చాలా ప్రయోజనాలు
ఆముదం గింజల నుంచి తీసిన నూనె వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అనేక వ్యాధుల్ని నయం చేస్తుంది. కావున దీనిని చాలా చోట్ల సాగు చేస్తారు. ఆయుర్వేద చర్మ దీని ఉపయోగాలు ప్రయోజనాలు తెలిపారు.దీని ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. విరోచనాలు, వాంతులు తో ఇబ్బంది పడుతున్నవారు ఈ ఆముదం ఆకుల నూనెలో రెండు నిమ్మ చుక్కల రసాన్ని కలిపి తాగితే చాలా లాభాలు ఉంటాయి. ఇది మాత్రమే కాదు.. తలనొప్పి, విరోచనాలు అనేక రకాల సమస్యలను తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆయుర్వేదం ప్రకారం ఆముదం కళ్ళకు మేలు చేస్తుంది. వాత, దగ్గు, కిడ్నీ, మంట, సయాటికా లాంటి వాటిని కి ఈ ఆముదంని ఉపయోగిస్తారు.బాడీ మసాజ్ కోసం కూడా దీనిని వాడుతుంటారు. దీని నూనె జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నూనె వాడడం వలన వెంట్రుకలు ఒత్తుగా తయారవుతాయి. ఆముదం యొక్క ఆకుల నుంచి గింజల వరకు అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. కానీ చాలామంది దీన్ని అడవి మొక్క అంటారు. కాబట్టి వ్యక్తులు జ్ఞానం లేకపోవడం వలన దీనిని వినియోగించరు..