UP Accident : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 18 మంది మృతి చెందారు. మరో 30 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది.
లక్నో, ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ గాయపడిన వాళ్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను ఉన్నావో లోని సీహెచ్సీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయమే పాల లోడ్ తో వెళ్తున్న పాల ట్యాంకర్ ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొన్నట్టు స్థానికులు తెలిపారు. ఉదయం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
https://twitter.com/ANI/status/1810881787066990880