Surat : కుప్పకూలిన ఆరంతస్తుల బిల్డింగ్.. ఏడుగురు మృతి

Surat : గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో విషాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సూరత్ లోని పాల్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

building collapsed in surat Gujarat

ఈ ఘటనలో మరో 15 మందికి గాయాలయ్యాయి. బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందులో చాలామంది చిక్కుకుపోయారు. బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీసేందుకు సహాయక బృందాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.

ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు ఆ భవనం కుప్పకూలిపోయింది. అయితే.. ఆ భవనం నిర్మించి పదేళ్లు కూడా కాలేదని.. భారీ వర్షాలకు కూడా తట్టుకోలేకుండా కుప్పకూలిపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పాల్ ప్రాంతంలో ఉన్న పలు ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు ఈ బిల్డింగ్ లో నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరగడంతో సహాయక చర్యలు ప్రారంభం కావడానికి సమయం పట్టింది. అయితే.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే ఏడుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికి తీసింది.

Author