KCR : గడ్డు పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ… అయినా కేసీఆర్ పై సానుభూతి లేదు…!

KCR : చెప్పకురా చెడేవు అనే మాట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి BRS Party  బాగా తెలిసి వస్తుందని పలువురు అంటున్నారు. అందుకే ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందు మన పనులు కూడా మంచిగా చేసుకోవాలని చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అంతా మాదే అని విర్రవీగితే ఇలాగే ఉంటుందంటూ తెలియజేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ కు ఎదురవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను వారి పార్టీలోకి చేర్చుకున్నారు. అయితే అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు బాధను అనుభవించేలా చేసింది. అప్పుడు చేసిన పాపమే ప్రస్తుతం కేసీఆర్ ను దహిస్తోంది.

అయితే 2019లో రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వలసలు విపరీతంగా పెరిగాయి. పని కట్టుకుని మరి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నారు. అయితే ఇప్పుడు సేమ్ అలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్ కనిపించడం గమనార్హం. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు దానం నాగేందర్ , కేశవరావు , కడియం శ్రీహరి , కడియం కావ్య ఈ విధంగా ఒక్కొక్కరు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. అయితే కొన్నేళ్ల క్రితం ఉన్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా భేదం ఉందని చెప్పాలి.

KCR : గడ్డు పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ... అయినా కేసీఆర్ పై సానుభూతి లేదు...!
KCR : గడ్డు పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ… అయినా కేసీఆర్ పై సానుభూతి లేదు…!

KCR  యూట్న‌ర్ తీసుకుంటున్న బీఆర్ ఎస్ నేత‌లు

అప్పుడు నాయకులంతా కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ వెళ్లేవారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అందరూ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. అంటే సీన్ మొత్తం రివర్స్ అయింది అన్నమాట. అందుకే దేనిని కూడా తక్కువ అంచనా వేయద్దు అనేది. అయితే అప్పుడు కేసీఆర్ చేసిన పాపమే ఇప్పుడు ఆయన దహిస్తోందని పలువురు అంటున్నారు. దీంతో కేసీఆర్ కూడా ఇప్పుడు తన నేతలను ఏమనలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అప్పుడు జరిగిన దానికి కాంగ్రెస్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ క్రమంలోనే ఏమైనా అంటే కాంగ్రెస్ నాయకులు నీవు నేర్పిన విద్యనే కదా అంటూ చెప్పుకొస్తున్నారు.

ఇక బీఆర్ఎస్ నేత కేటీఆర్ వారి పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్ ను కోరుతున్నాడు. అయితే ఒకప్పుడు ఇదే తరహాలో కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే హేళన చేసిన వారు ఇప్పుడు అదే పని చేయడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. కారు టైర్ పంచరవడంతో అందరూ దిగిపోతున్నారని కేసీఆర్ మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతున్నారని నేతలు బాధపడుతున్నారు.

KCR : గడ్డు పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ... అయినా కేసీఆర్ పై సానుభూతి లేదు...!
KCR : గడ్డు పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ… అయినా కేసీఆర్ పై సానుభూతి లేదు…!

ఈ క్రమంలోనే ఇన్నేళ్లు పదవులను అనుభవించి అధికారం కోల్పోగానే పార్టీని వీడి వెళ్లిపోవడంతో కేసీఆర్ కేటీఆర్ విచారణ వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి కష్ట కాలంలో అండగా ఉండాల్సిన నేతలు వరుసగా కాంగ్రెస్ లో చేరడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నేతలందరూ పార్టీని వదిలేసేలాగే కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితులకు బీఆర్ఎస్ నేతల అనాలోచిత నిర్ణయాలు కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday