Bhuma Akhila Priya : కుటుంబమే వ్యతిరేక వర్గం.. భూమా అఖిల ప్రియకు అగ్నిపరీక్ష..!

Bhuma Akhila Priya  : కర్నూలు రాజకీయాల్లో భూమా Bhuma Akhila Priya కుటుంబందే పెత్తనం. దశాబ్దాల కాలంగా కర్నూలు రాజకీయాలను శాసిస్తోంది భూమా కుటుంబమే. భూమా నాగిరెడ్డి దంపతులు ఉన్నంత కాలం కర్నూలులో వారిదే పెత్తనం. ఇక ఆళ్లగడ్డలో భూమాను ఓడించే వారే లేరు అనేంతగా ఉండేది. కానీ ఎప్పుడైతే భూమా దంపతులు చనిపోయారో అప్పటి నుంచే ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఇక నాగిరెడ్డి వారసురాలిగా ఆయన పెద్ద కూతురు అఖిల ప్రియ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబు ఆమెకు ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టారు. కానీ ఏం లాభం.. 2019 ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు.

అప్పటి నుంచి అఖిల ప్రియ Bhuma Akhila Priya నిత్యం ఏదో ఒక వివాదంలో ఉంటూ వస్తున్నారు. అప్పట్లో కిడ్నాప్ ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు ఆమెపై చాలానే వచ్చాయి. చాలా వివాదాలు ఆమెను చుట్టు ముట్టినా సరే చంద్రబాబు మాత్రం ఆమెకే టికెట్ కేటాయించారు. చంద్రబాబు టికెట్ ఇవ్వడమే పెద్ద విజయంగా ఆమె భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆమెకు సొంత కుటుంబీకులే ప్రత్యర్థులుగా మారారు. నాగిరెడ్డి అన్న కొడుకు కిషోర్ రెడ్డి గత వారం క్రితమే వైసీపీలో చేరాడు. వాస్తవానికి ఆయన బీజేపీ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా వైసీపీలో చేరాడు.

Bhuma Akhila Priya : కుటుంబమే వ్యతిరేక వర్గం.. భూమా అఖిల ప్రియకు అగ్నిపరీక్ష..!
Bhuma Akhila Priya : కుటుంబమే వ్యతిరేక వర్గం.. భూమా అఖిల ప్రియకు అగ్నిపరీక్ష..!

Bhuma Akhila Priya  : సొంత కుటుంబం వ్యతిరేకంగా మారడంతో అఖిల ప్రియకు క‌ష్ట‌మే

దాంతో ఇప్పుడు వైసీపీ బలంగా మారిందని అంటున్నారు. ఆళ్లగడ్డలో ఇప్పుడు వైసీపీకి కిషోర్ రాకతో బలం పెరిగిందని.. తామే గెలుస్తామని ప్రచారం మొదలు పెట్టారు. ఇలాంటి సమయంలో భూమా కుటుంబీకులు, భూమా వర్గం కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. కుటుంబీకుల్లో చాలామంది ఇప్పుడు అఖిల్ ప్రియకు Bhuma Akhila Priya వ్యతిరేకంగా ఉన్నారు. వారంతా ఆ మధ్య మీటింగ్ పెట్టుకుని అఖిల్ ప్రియకు టికెట్ ఇవ్వొద్దని చంద్రబాబుకు లేఖ రాశారు. ఇటు టీడీపీ కేడర్ కూడా ఆమెను వ్యతిరేకించింది. అయినా సరే చంద్రబాబు మాత్రం మొదటి లిస్టులోనే ఆమెకు టికెట్ కేటాయించారు.

Bhuma Akhila Priya : కుటుంబమే వ్యతిరేక వర్గం.. భూమా అఖిల ప్రియకు అగ్నిపరీక్ష..!
Bhuma Akhila Priya : కుటుంబమే వ్యతిరేక వర్గం.. భూమా అఖిల ప్రియకు అగ్నిపరీక్ష..!

కానీ ఇప్పుడు గెలుపు అవకాశాలు మాత్రం తగ్గిపోయాయని అంటున్నారు. ఎందుకంటే ఇటు సొంత కుటుంబం వ్యతిరేకంగా మారడంతో పాటు ఆమెకు అత్యంత సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డితో కూడా గొడవలు వచ్చాయంట. ఆయన ఇప్పుడు సహకరించే పరిస్థితి లేదని అంటున్నారు. ఇలా ఎటు చూసుకున్నా ఆమెకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షే అంటున్నారు.

Author

  • Uday

    లేటెస్ట్‌ తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, జాతీయ, వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

    View all posts
Uday