Bharateeyudu 2 Twitter Review : భారతీయుడు 2 ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. కానీ టాక్ ఏంటి ఇలా ఉంది?

Bharateeyudu 2 Twitter Review : ప్రస్తుతం ప్రపంచమంతా భారతీయుడు సినిమా కోసం ఎదురు చూస్తోంది. నిజానికి ఇది పాన్ ఇండియా మూవీ కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు, తమిళ్ మూవీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. లెజెండరీ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో సినిమా వస్తుంది అంటే మామూలుగా ఉంటుందా? ఇప్పటికే భారతీయుడు మూవీ వచ్చిన విషయం తెలిసిందే. 1996 లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఎన్నో సంచలనాలను సృష్టించింది. ఆ మూవీకి సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 మూవీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ మూవీ ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఈ మూవీని చూసిన మూవీ లవర్స్.. వెంటనే ట్విట్టర్ లో మూవీ రివ్యూను ఇచ్చేశారు. ఈసారి సేనాపతి దెబ్బ ఎలా ఉందో తెలుసుకుందాం రండి.

Advertisement

bharateeyudu 2 twitter review

Advertisement

ఫస్ట్ హాఫ్ ఏదో దెబ్బేసింది అని అంటున్నారు. తన ఆస్థాన రచయిత సుజాత గారిని శంకర్ మిస్ అయినట్టున్నారు. ఆయన కాలం చేశాక గట్టిగా దెబ్బ పడింది అంటూ ఓ యూజర్ రివ్యూ ఇచ్చేశాడు. బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్. ప్లాట్, డైలాగ్స్ అన్నీ 2024 సంవత్సరానికి తగ్గట్టుగా లేవు. కొన్ని సీన్లు ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. కొన్ని సీన్లు బాగానే ఉన్నా.. ఆ ఎమోషన్, డ్రామా వర్క్ అవుట్ అవ్వలేదు. కమల్, సిద్ధార్థ్ బాగా నటించారు. సెకండ్ హాఫ్ గట్టిగా కొడితేనే సెట్ అవుతుంది అంటూ మరో యూజర్ ట్వీట్ చేశాడు.

Bharateeyudu 2 Twitter Review : బోరింగ్ సీన్లు ఎక్కువ

కొందరైతే బోరింగ్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని.. ఎగ్జయిట్ అయ్యే సీక్వెన్సులేవీ లేవని.. ఫస్ట్ హాఫ్ అయితే గ్రిప్ లేకుండా సాగిందన్నారు. మూవీ ప్రారంభం బాగానే  ఉంటుంది కానీ.. ఆ తర్వాతే బోర్ కొడుతుంది. శంకర్ నుంచి మరో డిజాస్టర్. గేమ్ చేంజర్ అయినా శంకర్ కు మంచి గుర్తింపునిస్తుందేమో వేచి చూడాలి అంటూ మరో యూజర్ ట్వీట్ చేశాడు.

మొత్తానికి ఎవరు చూసినా ఈ సినిమా అంతగా లేదని.. భారతీయుడు లేవల్ లో ఊహించుకునే సీన్లు ఏవీ లేవంటూ ట్విట్టర్ లో పోస్టులు చేస్తున్నా.. సినిమా రిలీజ్ అయి మూవీ లవర్స్ సినిమా చూసేవరకు ఎలాంటి అంచనాలు వేసే చాన్స్ అయితే లేదు. ఒక్కోసారి ప్రీమియర్స్ లో ఇచ్చే రివ్యూలు కిందా మీదా అయ్యే చాన్స్ కూడా ఉంది. ఇంకాసేపు అయితే పూర్తి స్థాయి రివ్యూ వస్తుంది.

Author